వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

12వ తరగతి సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల: కేజ్రీవాల్ కుమారుడికి ఎన్ని మార్కులంటే..?

|
Google Oneindia TeluguNews

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 12వ తరగతి ఫలితాలను విడుదల చేసింది. ఇందులో ఇద్దరు విద్యార్థినులు ఒకే మార్కులతో టాపర్స్‌గా నిలిచారు. హన్సికా శుక్లా, కరిష్మా అరోరాలు 499 మార్కులు సంపాదించారు.

సీబీఎస్‌ఈ ఫలితాలు విడుదల

హన్సికా శుక్లా ఘజియాబాద్‌లోని ఢిల్లీ పబ్లిక్ స్కూలుకు చెందగా... మరో విద్యార్థిని కరిష్మా అరోరా ముజఫర్ నగర్‌లోని ఎస్‌డీ పబ్లిక్ స్కూలులో చదివింది. నిర్మల్ ఆశ్రం స్కూలుకు చెందిన గౌరంగీ చావ్లా, కేంద్రీయ విద్యాలయకు చెందిన రిషికేష్ ఐశ్వర్య, హర్యానాలోని బీఆర్ఎస్‌కే ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూలుకు చెందిన భవ్య అనే విద్యార్థులు 498 మార్కులతో రెండవ స్థానంలో నిలిచారు. ఇక 497 మార్కులు సాధించి మూడవ స్థానంలో మొత్తం 18 మంది విద్యార్థులు నిలువగా... అందులో 11 మంది అమ్మాయిలు ఉండటం విశేషం. ఇదిలా ఉంటే తొలి ర్యాంకు సాధించిన హన్సికా శుక్లా తనకు ఇంగ్లీషులో 99 మార్కులు వచ్చాయని మిగతా అన్ని సబ్జెక్టుల్లో 100 శాతం మార్కులు వచ్చినట్లు తెలిపింది. తన విజయానికి కారణమేంటని ప్రశ్నించగా తను ఎలాంటి ట్యూషన్‌లకు వెళ్లలేదని సొంతంగా చదవడంతోనే ఇంతటి విజయం సాధించగలిగినట్లు హన్సిక చెప్పింది.

పుల్వామా ఉగ్రదాడులు బీజేపీ కుట్రే: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి పుల్వామా ఉగ్రదాడులు బీజేపీ కుట్రే: గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి

96.4శాతం మార్కులు సాధించిన కేజ్రీవాల్ కుమారుడు

ఇక ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుమారుడు ఈ పరీక్షల్లో 96.4శాతం మార్కులు వచ్చాయి. ఈ విషయాన్ని అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా సతీమణి ట్వీట్ చేశారు. భగవంతుడి కృప, సన్నిహితుల దీవెనలతో తన కొడుకు 96.4శాతం మార్కులు సాధించాడంటూ ట్వీట్ చేశారు సునీతా కేజ్రీవాల్.

91శాతం మార్కులు సాధించిన స్మృతీ ఇరానీ కుమారుడు

మరోవైపు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ కూడా తన కొడుకు సాధించిన విజయాన్ని ట్విటర్ ద్వారా షేర్ చేసుకున్నారు. ప్రపంచ కెంపో చాంపియన్‌షిప్‌లో పాల్గొని కాంస్యపతకం గెలవడమే కాదు 12వ తరగతి సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలో 91శాతం మార్కులు సాధించాడంటూ సంతోషం వ్యక్తం చేశారు.

సీబీఎస్‌ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి

సీబీఎస్‌ఈ ఫలితాల్లో బాలికలదే పైచేయి

ఈ సారి 12వ తరగతి బోర్డు ఎగ్జామ్స్‌కు 13 లక్షల మంది విద్యార్థులు హాజరైనట్లు సీబీఎస్‌ఈ బోర్డు తెలిపింది. అందులో 83.4శాతం మంది విద్యార్థులు పాస్ అయినట్లు వెల్లడించింది. ఈసారి విడుదలైన ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉన్నట్లు బోర్డు అధికారి వెల్లడించారు. బాలికల ఉత్తీర్ణత శాతం 88.70% గా ఉండగా... బాలురుది 79.4శాతంగా ఉంది. ఇక నగరాల వారీగా చూస్తే తిరువనంతపురంలో ఉత్తీర్ణత శాతం 98.2శాతం ఉండగా... 92.93 శాతం ఉత్తీర్ణతతో చెన్నై రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో 91.87శాతంతో ఢిల్లీ నిలిచినట్లు సీబీఎస్ఈ బోర్డు నిలిచింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4, 2019 మధ్య 12వ తరగతి పరీక్షలు జరిగాయి. ఇక దీనికి సంబంధించిన ఫలితాలు సీబీఎస్ఈ అధికార వెబ్‌సైట్‌ cbse.nic.in లేదా cbseresults.nic.inలో చెక్ చేసుకోవచ్చని బోర్డు వెల్లడించింది. results.nic.inలో కూడా ఫలితాలు తెలుసుకోవచ్చని బోర్డు వెల్లడించిది.

English summary
Hansika Shukla and Karishma Arora have emerged as joint topper in CBSE Board Class 12th examinations, the results for which has been declared on Thursday, i.e. May 2. Both Shukla and Arora have secured a picture-perfect marks of 499 each.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X