Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కామ పిశాచులు: లిఫ్ట్ ఇస్తానని చెప్పి క్లాస్‌మేట్‌ను అడవుల్లోకి తీసుకెళ్లి అత్యాచారం

ఒడిషా: ఒడిషాలో దారుణం చోటుచేసుకుంది. కలిసి చదువుకునే విద్యార్థులూ కామాంధుల్లా మారారు. తోటి విద్యార్థినిపై అత్యాచారంకు పాల్పడ్డారు. ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా ఐదు మంది విద్యార్థులు అమ్మాయిపై పైశాచికంగా ప్రవర్తించారు. నమ్మి వారి వెంట వెళ్లడమే ఆమె చేసిన పాపం... అంతలోనే కామంతో కళ్లు మూసుకుపోయి జంతువులకంటే దారుణంగా ప్రవర్తించారు. అమ్మాయిపై అత్యాచారం చేసిన నిందితుల్లో ఒకడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

ఒడిషాలోని సుందర్‌గఢ్‌లోని అడవులకు తీసుకెళ్లి అమ్మాయిపై అత్యాచారం చేశారు దుర్మార్గులు. జూన్ 26న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని తన ఇంటి దగ్గర వదిలి బయటకు చెబితే ప్రాణాలు తీసేందుకు వెనకాడబోమని భయపెట్టారు. కింజిరికేలా డిగ్రీ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతోంది బాధితురాలు. కొన్ని రోజులుగా కాలేజీకి వెళ్లకపోవడంతో తన తల్లి బంధువులు గట్టిగా అడగడంతో అసలు విషయం చెప్పింది. దీంతో బాధితురాలిని తీసుకెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు బంధువులు.

Classmates gang rape a girl in odisha forest,three held by police

ఎప్పటిలాగే కాలేజీకి తన స్కూటీ పై వెళ్లిందని జూన్ 26న తన స్కూటీ తాళాలు ఎక్కడో పోగొట్టుకుందని బాధితురాలు ఫిర్యాదు చేసింది. ఇక కాలేజీ తర్వాత ఇంటికెళ్లాల్సి ఉండగా ఆమె క్లాస్‌మేట్స్ అయిన నలీంద్ర ఓరామ్, జయదేబ్ కిసాన్‌లు ఆమెను తన ఇంటి వద్ద డ్రాప్ చేస్తామని వారి బైకుపై తీసుకెళ్లారు. నలీంద్ర ఓరామ్ అనే నిందితుడు బాధితురాలు ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. వారిని నమ్మిన బాధితురాలు వారి బైకు ఎక్కింది. ఇక సగం దూరం వెళ్లాక దట్టమైన అడవుల్లోకి లాక్కెళ్లారు. మధ్యలో మరో మిత్రుడు రంజిత్ ఓరామ్ కలిశాడు. ఆ తర్వాత మరో క్లాస్‌మేట్‌ వచ్చాడు. ఇలా వంతులుగా ఒక్కొక్కరూ అమ్మాయిపై అత్యాచారం చేశారు. అనంతరం ఆమెను ఇంటిదగ్గర వదిలి వెళ్లి బెదిరించి వెళ్లినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలు గిరిజన యువతి అని తెలిపారు. ప్రస్తుతం కేసుకు సంబంధించి ముగ్గురని అరెస్టు చేసినట్లు చెప్పిన పోలీసులు నాలుగో నిందితుడి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+