• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

12 ఏళ్ల విద్యార్థినిని ఆరు రోజుల పాటు 14 మంది తోటి విద్యార్థులు...

By Ramesh Babu
|

ఝబువా: హోం వర్క్‌ చేయలేదనే కారణంతో 12 ఏళ్ల విద్యార్థిని తోటి విద్యార్థులు 168 చెంపదెబ్బలు కొట్టారు. అలా చేయమని ఉపాధ్యాయుడే చెప్పడంతో తోటి విద్యార్థులు చేయాల్సి వచ్చింది. మధ్యప్రదేశ్‌లోని ఒక విద్యాలయంలో ఈ దారుణమైన ఘటన జరిగింది.

మనిషా? మృగమా?: మాజీ భార్యను చంపి.. ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి...మనిషా? మృగమా?: మాజీ భార్యను చంపి.. ముక్కలు చేసి.. కుక్కర్‌లో ఉడికించి...

పెద్దలు అడ్డుచెప్పారని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట!పెద్దలు అడ్డుచెప్పారని పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న ప్రేమజంట!

థండ్ల పట్టణంలో ఉన్న నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థిని హోం వర్క్‌ చేయడం లేదనే కారణంగా ఉపాధ్యాయుడు మనోజ్‌కుమార్‌ వర్మ చెంపదెబ్బల శిక్ష విధించారు.

girl-slapped

ఆరు రోజుల పాటు 14 మంది విద్యార్థులు సదరు విద్యార్థినికి చెంపదెబ్బలు కొట్టాల్సిందిగా ఆదేశించాడు. జనవరి 11 నుంచి 16 వరకు హోం వర్క్‌ చేయని సదరు విద్యార్థిని తోటి విద్యార్థులు రోజుకు రెండుసార్లు చెంపదెబ్బలు కొట్టారు. అలా దాదాపు 168 చెంపదెబ్బలు కొట్టారు.

విషయం తెలుసుకున్న విద్యార్థిని తండ్రి పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేయగా.. అది స్నేహపూర్వకంగా విధించిన శిక్షే అంటూ యాజమాన్యం కూడా టీచర్‌నే వెనకేసుకొచ్చింది.

సదరు బాలిక చదువులో బాగా వెనకబడి పోయిందని, తనకు ఇచ్చిన హోం వర్క్‌ చేయకుండా ఉంటుందని అందుకే ఉపాధ్యాయుడు ఈ విధంగా శిక్ష విధించారని ప్రిన్సిపాల్‌ సాగర్‌ చెప్పుకొచ్చారు.

ఈ ఘోరంపై ప్రిన్సిపాల్‌ పట్టించుకోకపోగా టీచర్‌నే వెనకేసుకురావడంతో గత్యంతరం లేక ఆ విద్యార్థిని తండ్రి సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తోటి విద్యార్థులు రోజు చెంపదెబ్బలు కొడుతుండటంతో తమ కుమార్తె పాఠశాలకు వెళ్లడానికి భయపడుతోందని, ఆమె ఆరోగ్యం కూడా పాడైందని ఆమె తండ్రి తెలిపారు.

English summary
A 12-year-old girl was slapped 168 times over a period of six days by her classmates at a residential school on the instructions of their teacher, the child's father complained to school authorities and police. However, the school principal K Sagar termed it a punishment. "They were not strong slaps but mild and friendly ones. We will also talk to the parents," Sagar said. The incident took place at the Navodaya Vidyalaya in Thandla town here and the girl's father, Shivpratap Singh, told police that she was slapped 168 times between January 11 -16 for not completing her homework. The girl is a student of Class VI at the school.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X