‘క్లీన్ ఇండియా’: చీపురు పడతానన్న మోడీ(పిక్చర్స్)

బెంగళూరు: పనికి రాని చట్టాలను, బూజు పట్టిన చట్టాలను రద్దు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా మంగళవారం బెంగళూరు నగరానికి వచ్చిన ఆయనను కర్ణాటక భారతీయ జనతా పార్టీ స్థానిక హెచ్ఎఎల్ విమానాశ్రాయ ఆవరణలో ఘనంగా సత్కరించించింది. ఈ సందర్భంగా నిర్వహించిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించారు.

గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జపాన్‌ పర్యటన సందర్భంగా అక్కడి రహదారులు అద్దాల్లా మెరిసిపోతుండటాన్ని చూశానని చెప్పారు. మన దేశంలోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించిన ఆయన.. దేశాన్ని మురికి నుంచి రక్షించేందుకు ప్రజలంతా చేతులు కలిపి సంకల్పించుకోవాలని వారికి పిలుపునిచ్చారు. వారానికి రెండుగంటలు.. ఏడాదికి 100 గంటలు.. తనకు భిక్షగా ఇచ్చి స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మోడీకి కర్ణాటక సిఎం స్వాగతం

మోడీకి కర్ణాటక సిఎం స్వాగతం

పనికి రాని చట్టాలను, బూజు పట్టిన చట్టాలను రద్దు చేస్తామని పరోక్షంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.

మోడీ అభివాదం

మోడీ అభివాదం

గాంధీ జయంతి(అక్టోబర్ 2) నుంచి స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆయన పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మోడీ ప్రసంగం

మోడీ ప్రసంగం

జపాన్‌ పర్యటన సందర్భంగా అక్కడి రహదారులు అద్దాల్లా మెరిసిపోతుండటాన్ని చూశానని చెప్పారు. మన దేశంలోనూ ఇది ఎందుకు సాధ్యం కాదని ప్రశ్నించిన ఆయన.. దేశాన్ని మురికి నుంచి రక్షించేందుకు ప్రజలంతా చేతులు కలిపి సంకల్పించుకోవాలని వారికి పిలుపునిచ్చారు.

మోడీ

మోడీ

వారానికి రెండుగంటలు.. ఏడాదికి 100 గంటలు.. తనకు భిక్షగా ఇచ్చి స్వచ్ఛభారత్‌ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

మోడీకి కేంద్రమంత్రి స్వాగతం

మోడీకి కేంద్రమంత్రి స్వాగతం

దేశాన్ని చెత్త రహిత, సుందర భూభాగంగా మలచేందుకు ప్రజలందరూ ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు.

మోడీకి జ్ఞాపిక

మోడీకి జ్ఞాపిక

అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తాను స్వయంగా చీపురు చేతబట్టి ‘స్వచ్ఛతా ఆందోళన్' చేపడతానని ప్రధాని మోడీ వెల్లడించారు.

మోడీ

మోడీ

‘గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించారు. ఇప్పుడు మనమంతా దేశానికి మురికి నుంచి విముక్తి కల్పించాలి' అని హితవు పలికారు.

‘‘దేశ ప్రజల నుంచి నేను భిక్ష కోరుతున్నా.. ఏడాదికి 100 గంటలు. మనందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే మీరెలా ఇల్లు శుభ్రం చేసుకుంటారో అలాగే దేశంలోని మురికినంతా తొలగిస్తే సౌభాగ్యం వస్తుంది' అని మోడీ అన్నారు. తమ ప్రభుత్వం ప్రారంభించిన జనధన్‌ యోజన కార్యక్రమం విజయవంతమైందని ఆయన ప్రకటించారు. తాము జీరో బ్యాలెన్స్‌తో ఖాతాలు తెరిచేందుకు అవకాశం ఇచ్చినప్పటికీ.. ఈ ఖాతాల్లో ఇప్పటికే రూ.1500 కోట్లకు పైగా జమయ్యాయని వివరించారు.

గత ప్రభుత్వాలు కొత్త చట్టాలు చేయడమే గొప్పనుకున్నాయని, కానీ వాటిని తాను తొలగిస్తున్నానని చెప్పారు. ప్రభుత్వం సులువుగా పనిచేయాలంటే చట్టాల అడవిని శుభ్రం చేయాల్సిందేనన్నారు. ‘‘ఒకే అంశంపై మనకు 5 నుంచి 10 చట్టాలున్నాయి. కొన్ని వందేళ్లనాటివి.. కొన్ని 50 ఏళ్ల నాటివి.. కొన్ని 150 ఏళ్ల నాటివి. ఈ చట్టాలను తమకు అనుగుణంగా అన్వయించుకుని ఎవరైనా తమ పనిని ఆపేయవచ్చు' అని అన్నారు. అలాంటి పరిస్థితిని తప్పించేందుకే తమ ప్రభుత్వం ఈ ప్రక్రియ చేపట్టిందని అన్నారు.

దేశాన్ని చెత్త రహిత, సుందర భూభాగంగా మలచేందుకు ప్రజలందరూ ప్రతినబూనాలని మోడీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా తాను స్వయంగా చీపురు చేతబట్టి ‘స్వచ్ఛతా ఆందోళన్' చేపడతానని ప్రధాని మోడీ వెల్లడించారు. ‘గాంధీ మహాత్ముడు దేశానికి స్వాతంత్ర్యాన్ని సంపాదించి బ్రిటిష్ పాలన నుంచి విముక్తి కల్పించారు. ఇప్పుడు మనమంతా దేశానికి మురికి నుంచి విముక్తి కల్పించాలి' అని హితవు పలికారు. ‘పెద్దలు, చుట్టాలు వస్తున్నారంటే చాలు ఇంటిని శుభ్రం చేస్తాం. అలాంటిది దేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలో వద్దో ఆలోచించండి' అని అన్నారు. పరిశుభ్రతా కార్యక్రమంలో పాల్గొనడం కూడా దేశ బక్తేనని చెప్పారు.

ఇది ఇలా ఉండగా విజయదశమి సందర్భంగా అకోబర్‌ 3న ఉదయం 11 గంటలకు.. ప్రధాని నరేంద్రమోదీ రేడియో ద్వారా ప్రజలతో తన ఆలోచనలు పంచుకోవాలనుకుంటున్నారు. ఈమేరకు ఆయన ట్విటర్‌ ఖాతాలో హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో ట్వీట్‌ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+