టెన్త్ ఫలితాల్లో స్టేట్ టాపర్ గా నిలిచిన సీఎం కూతురు
టెన్త్ ఫలితాల్లో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూతురు సత్తా చాటారు. ఫడ్నవీస్ కుమార్తె దివిజ టెన్త్ ఫలితాల్లో ఏకంగా 92.6 శాతం మార్కులు సాధించి టాపర్స్ లో ఒగరుగా నిలిచారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ సతీమణి అమృత ఎక్స్ ఖాతా ద్వారా తెలిపారు. సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూతురు టెన్త్ ఫలితాల్లో టాప్ మార్కులు రావడంతో పలువురు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

మా మనసులు ఆనందంతో ఉప్పొంగుతున్నాయి. మా కుమార్తె దివిజ టెన్త్ ఫలితాల్లో 92.60 శాతం మార్కులు సాధించింది. మేము సంతోషంగా ఉన్నాం. అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు ఫడ్నవీస్ సతీమణి అమృత. తాజాగా మహారాష్ట్రలో టెన్త్, ఇంటర్ ఫలితాలు ఒకేసారి విడుదల చేశారు. ఈ మేరకు ఫలితాలను విడుదల చేసినట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ జోసెఫ్ ఎమ్మానుయెల్ తెలిపారు.
सर्वांना अक्षय तृतीयेनिमित्त हार्दिक शुभेच्छा.
— AMRUTA FADNAVIS (@fadnavis_amruta) April 30, 2025
आजच्या शुभमुहूर्तावर वर्षा या निवासस्थानी आम्ही छोटीशी पूजा संपन्न करीत गृहप्रवेश केला.
आजच्या दिवशीची आणखी एक अत्यंत आनंदाची बातमी आपल्या सर्वांना सांगताना मन खुशीने भरून गेलंय, आमची सुकन्या दिविजा ही १०वी च्या बोर्ड परीक्षेत ९२.६०… pic.twitter.com/l03aLKE2Ak
అయితే మహారాష్ట్ర టెన్త్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. బాలికల పాస్ పర్సెంటేజ్ 99.45 శాతం ఉండగా.. బాలుర పాస్ పర్సెంటేజ్ 98.64శాతంగా ఉంది. ఇక ఇంటర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 99.45 కాగా బాలుర ఉత్తీర్ణత శాతం 98. 64 గా ఉంది.












Click it and Unblock the Notifications