ప్రతీ మహిళ ఖాతాలో రూ 2,500..!!
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు హోరా హోరీగా మారాయి. అక్కడ రెండు కూటమి నేతలు గెలుపు కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ గెలవటం ఈ సారి బీజేపీకి ప్రతిష్ఠాత్మకంగా భావి స్తోంది. అధికారం నిలబెట్టుకోవటం కోసం సీఎం హేమంత్ సోరెన్ అన్ని అస్త్రాలు ప్రయోగిస్తు న్నారు. తాము తిరిగి గెలిస్తే అమలు చేసే హామీలను సోరెన్ ప్రకటించారు. ప్రధానంగా మహిళా ఓటర్ల ను ఆకట్టుకోవటం పైన గురి పెట్టారు.
సోరెన్ హామీలు
జార్ఖండ్ ఎన్నికల్లో ఈ సారి బీజేపీ కూటమి హిందుత్వ .. జేఎంఎం గిరిజన, మహిళా ఓటింగ్ పైనే ఎక్కువగా ఆధార పడుతోంది. ముఖ్యమంత్రి సోరెన్ తాము తిరిగి గెలిస్తే అమలు చేసే పథకాల పైన హామీలు ప్రకటించారు. ప్రజలకు నిత్యావసరాల కోటా పెంచటంతో పాటుగా పెన్షన్ వయసు తగ్గిస్తామని.. ప్రతీ మహిళ ఖాతాల్లో నెలకు రూ 2,500 జమ చేస్తామని హామీ ఇచ్చారు. జార్ఖండ్ లో ప్రస్తుత ప్రభుత్వం 5 కిలోల రేషన్ ఉచితంగా ఇస్తోంది. తాము తిరిగి అధికారంలోకి వస్తే ఏడు కిలోలకు పెంచుతామని సోరెన్ హామీ ఇచ్చారు.

ప్రతీ ఒక్కరికీ మేలు
తన ఎన్నికల హామీలను సోరెన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. జార్ఖండ్‌లో జేఎంఎం నేతృత్వంలో ఇండియా అలయన్స్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వీటిని అమలు చేస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో రద్దు చేసిన 11 లక్షల రేషన్ కార్డుల కారణంగా అనేక మంది నష్టపోయారని చెప్పుకొచ్చారు. పలువురు దళితులు, గిరిజనులు ప్రాణాలో కోల్పోయారని ఆరోపించారు. తమ కూటమి అధికారంలోకి వస్తే రేషన్ పెంచటం ద్వారా మంచి పోషకాహారం అందుతుందని భరోసా ఇచ్చారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం ఇచ్చే రేషన్ అందేలా చూస్తామని సోరెన్ పేర్కొన్నారు.

మహిళల కోసం
వీటితో పాటుగా మహిళా ఓటర్లను ఆకట్టుకునే విధంగా సోరోన్ మరో ప్రకటన చేసారు. కాకుండా మాయన్ సమ్మాన్ యోజన కింద మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వనున్నట్లు తెలిపారు. అదే విధంగా జార్ఖండ్‌లోని అంగన్‌వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజనంలో పిల్లలకు గుడ్లు, పండ్లు కూడా అందజేస్తున్నామన్నారు. రాష్ట్రంలోని 40 లక్షలకు పైగా వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులకు సామాజిక భద్రతా పెన్షన్‌తో అనుసంధానించామని గుర్తు చేసారు. కార్మికుల పెన్షన్ వయస్సు 60 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలకు తగ్గించామని వివరించారు. 18-50 సంవత్సరాల వయస్సు గల మహిళలకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
-
ప్రధాని మోదీపై ప్రశంసలు, మనసులో మాట బయట పెట్టిన జగన్..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications