వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జార్ఖండ్ లో రాజకీయ ఉత్కంఠ : నేడే సోరెన్ విశ్వాస పరీక్ష - ఆ వెంటనే..!!

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ లో రాజకీయ ఉత్కంఠ కొనసాగుతోంది. మరి కొద్ది గంటల్లో జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి సోరెన్ విశ్వస పరీక్ష ..ఆ తరువాత చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి పెరుగుతోంది. మైనింగ్ వ్యవహారంలో సీఎం సోరెన్ తీసుకున్న ఒక నిర్ణయంతో ఆయన పైన అనర్హత వేటుకు ఎన్నికల సంఘం గవర్నర్ కు సిఫార్సు చేసింది. అయితే, గవర్నర్ కార్యాలయం నుంచి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సోరెన్ పైన చర్యల దిశగా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

జార్ఖండ్ లో నేడు కీలక పరిణామాలు

జార్ఖండ్ లో నేడు కీలక పరిణామాలు

ఇదే సమయంలో తన ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు ఆధికార కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగా ఛత్తీస్​గఢ్​​ వెళ్లిన 30 మంది ఎమ్మెల్యేలు తిరిగి రాంచీకి చేరుకున్నారు. రాయ్‌పుర్‌ నుంచి ఛార్టెడ్‌ విమానంలో 30మంది ఎమ్మెల్యేలు, ఇతర నేతలు రాంచీకి చేరుకున్నారు. సోమవారం జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ తన బలాన్ని నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు.

గవర్నర్ నిర్ణయం ప్రకటించకపోవటం.. బీజేపీ తీరు పైన జార్ఖండ్ అధికార పార్టీ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న ప్రతిష్టంభనపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ గవర్నర్‌కు యూపీఏ ఎమ్మెల్యేలు విజ్ఞప్తి చేశారు.

సభలో విశ్వాస పరీక్ష.. ఎమ్మెల్యేలు సిద్దం

సభలో విశ్వాస పరీక్ష.. ఎమ్మెల్యేలు సిద్దం

అయితే, వారికి నెలకొన్న అనుమానాలకు త్వరలోనే స్పష్టత ఇస్తానంటూ గవర్నర్ హామీ ఇచ్చారు. ఆయన తాజాగా ఢిల్లీ పర్యటకు వెళ్లారు. ఆయన వ్యక్తిగత పనుల మీదనే రాజధానికి వెళ్లారని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాయపూర్ నుంచి రాంఛీకి తిరిగి వచ్చిన అధికార ాపర్టీలు ఎమ్మెల్యేలు ఈ రోజు జరుగనున్న విశ్వాస పరీక్షలో వీరంతా ఓటువేయనున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చలేరన్న సంకేతాన్ని బీజేపీకి పంపనున్నారు. సభ ప్రారంభం..ముగింపు దాకా గవర్నర్ నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

సోరెన్ నిర్ణయం పైన ఉత్కంఠ

సోరెన్ నిర్ణయం పైన ఉత్కంఠ

సభలో బల నిరూపణ తరువాత.. గవర్నర్ ఏ నిర్ణయం తీసుకున్నా.. సోరెన్ తన పదవికి రాజీనామా చేయాల్సిన పరిస్థితులు ఎదురైనా అధికార పార్టీ నేతలు సిద్దం అవుతున్నారు. సభలో బల నిరూపణ జరిగితే..ఆ తరువాత సోరెన్ రాజీనామా అనివార్యంగా మారితే..ఆయన సతీమణికి సీఎంగా అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయని చెబుతున్నారు. సభలో సోరెన్ ప్రభుత్వాన్ని సంపూర్ణ మెజార్టీ ఉంది. దీంతో.. జార్ఖండ్ లో హేమంత్ సోరెన్ ప్రభుత్వానికి ఈ రోజు చోటు చేసుకొనే పరిణామాలు కీలకం కానున్నాయి.

English summary
Chief Minister Hemant Soren-led United Progressive Alliance (UPA) government is all set to seek a trust vote in the State Assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X