కెసిఆర్‌కు సిఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డ్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సిఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ ఛాయిస్ అవార్డు- 2014 వరించింది. మంగళవారం సిఎం కెసిఆర్ తరపున తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కె కేశవరావు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
సిఎన్ఎన్-ఐబిఎన్ 2006 నుంచి 6 విభాగాల్లో ఈ అవార్డు ఇస్తోంది. సామాజిక వేదికల్లో ప్రజాభిమానమే కొలబద్దగా విజేతలను ఎంపిక చేస్తారు. ఈ అవార్డు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు అంకితమని ఈ సందర్భంగా కేశవరావు పేర్కొన్నారు.
కాగా, రాజకీయం, స్పోర్ట్స్, బిజినెస్, గ్లోబల్ ఇండియన్, ఎంటర్‌టైన్‌మెంట్, పాపులర్ చాయిస్, పబ్లిక్ సర్వీస్ అనే విభాగాల్లో 2014వ సంవత్సరానికి ప్రతి విభాగంలో ఆరుగురు నామినీలను ఎంపిక చేసి.. వారి నుంచి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌లను ఎంపిక చేశారు. ఇందులో పాపులర్ చాయిస్ విభాగంలో రాజకీయ కేటగిరీలో కేసీఆర్ ముందు వరుసలో నిలిచారు.
భారతదేశ చరిత్రలో రాష్ట్ర సాధన కోసం దీర్ఘకాలం శాంతియుత ఉద్యమం నడిపిన రాజకీయ నాయకుడిగా, చివరికి ఆ ఉద్యమం ద్వారా రాష్ర్టాన్ని సాధించిన వ్యక్తిగా కేసీఆర్ ప్రజల నుంచి భారీ స్థాయిలో గుర్తింపు పొందారని, దేశంలో 29వ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి కూడా అయ్యారని ఆ చానల్ పేర్కొంది.
దశాబ్ద కాలానికి పైగా రాష్ట్ర సాధన కోసం ఉద్యమం నడిపిన గుర్తింపు కేసీఆర్‌కే దక్కిందని వ్యాఖ్యానించింది. ఇదే కేటగిరీలో కేరళకు చెందిన పోలీసు అధికారి విజయన్ కూడా అవార్డు పొందారు. 2014 సంవత్సరానికి ఇండియన్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రధాని నరేంద్ర మోడీ నిలిచారు. జీవితకాల సాఫల్య పురస్కారాన్ని ఇస్రో బృందం చేజిక్కించుకుంది. రాజకీయ నేతల్లో అరుణ్‌జైట్లీని జ్యూరీ ఎంపిక చేసింది.
శాంతియుతంగా ఉద్యమం నడిపి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్‌కు దేశవ్యాప్తంగా ఆదరణ ఉందని టిఆర్ఎస్ ఎంపీలు సీతారాం నాయక్, నర్సయ్యగౌడ్, వినోద్ కుమార్, కొత్త ప్రభాకర్ రెడ్డి, బిబి పాటిల్ చెప్పారు. ఇది కేవలం సిఎన్ఎన్-ఐబిఎన్ ఇచ్చిన పురస్కారం కాదని, దేశవ్యాప్తంగా ప్రజలు సామాజిక వేదికల ద్వారా ఓటు వేస్తే వచ్చిందని తెలిపారు. తెలంగాణ అనేది ఒక బ్రాండ్ అయితే.. ఆ బ్రాండ్‌కు అంబాసిడర్ కెసిఆర్ అని పేర్కొన్నారు.
అవార్డులు పొందిన వారు:
ఇండియన్ ఆఫ్ ది ఇయర్ : నరేంద్ర మోడీ
అవుట్‌స్టాండింగ్ అచీవ్‌మెంట్: అజీం ప్రేమ్‌జీ, కైలాశ్ సత్యార్థి
పాపులర్ ఛాయిస్ : కె చంద్రశేఖర్‌రావు, పి విజయన్
రాజకీయం: అరుణ్‌జైట్లీ (కేంద్ర ఆర్థిక మంత్రి)
గ్లోబల్ ఇండియన్: సత్య నాదెళ్ల (మైక్రోసాఫ్ట్ సీఈవో)
క్రీడలు : జీతూ రాయ్
బిజినెస్: ఎన్ చంద్రశేఖరన్ (టిసిఎస్)
వినోదరంగం: చేతన్ భగత్ (రచయిత)
ప్రజాసేవ : తంగమ్ రినా (జర్నలిస్టు)

అవార్డు అందుకుంటున్న కెకె
తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును సిఎన్ఎన్-ఐబిఎన్ పాపులర్ చాయిస్ అవార్డు-2014 వరించింది.

అవార్డు అందుకుంటున్న కెకె
మంగళవారం సిఎం కెసిఆర్ తరపున తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపి కె కేశవరావు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు.

అవార్డు అందుకుంటున్న కెకె
సిఎన్ఎన్-ఐబిఎన్ 2006 నుంచి 6 విభాగాల్లో ఈ అవార్డు ఇస్తోంది. సామాజిక వేదికల్లో ప్రజాభిమానమే కొలబద్దగా విజేతలను ఎంపిక చేస్తారు.

అవార్డు అందుకుంటున్న కెకె
ఈ అవార్డు తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారులకు అంకితమని ఈ సందర్భంగా కేశవరావు పేర్కొన్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications