వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్టాలిన్‌తో కేసీఆర్ భేటీ.. యాదాద్రి ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానం

|
Google Oneindia TeluguNews

తమిళనాడు సీఎం స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. ఇవాళ సాయంత్రం సమావేశమై.. పలు అంశాలను చర్చించారు. వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన యాదాద్రి ఆలయం పున: ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రారంభానికి రావాలని స్టాలిన్‌ను కేసీఆర్ ఆహ్వానించారు. తర్వాత ఫెడరల్ ప్రంట్ గురించి కూడా డిస్కష్ చేశారు. 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో.. మళ్లీ ఫ్రంట్‌ దిశగా అడుగులు పడుతున్నాయి. స్టాలిన్ సుముఖత వ్యక్తం చేస్తే.. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్‌తో మరోసారి కేసీఆర్ సమావేశమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

రెండు రోజుల కోసం తమిళనాడుకు సీఎం కేసీఆర్‌ వచ్చిన సంగతి తెలిసిందే. స్టాలిన్‌‌తో భేటీ తర్వాత తమిళనాడు పర్యటన ముగిసింది. అంతకుముందు కేసీఆర్ తిరుత్తణిలో కూడా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుచ్చి జిల్లా శ్రీరంగంలోని రంగనాథస్వామిని సతీసమేతంగా దర్శించుకున్నారు. కేసీఆర్‌ బృందానికి తమిళనాడు పురపాలకశాఖ మంత్రి కేఎన్‌ నెహ్రూ, కలెక్టర్‌ శివరావు, ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. తొలుత ఆలయ గజరాజు వద్ద ఆశీస్సులు తీసుకున్న కేసీఆర్‌ కుటుంబీకులు.. శ్రీరంగనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేసీఆర్‌తో సతీమణి కె.శోభ, కుమారుడు, మంత్రి కేటీఆర్‌, ఎంపీ సంతో్‌షకుమార్‌, కేటీఆర్‌ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు, కూతురు అలేఖ్య ఉన్నారు.

cm kcr invite to tamilnadu cm stalin for yadadri temple reopening

శ్రీ రంగం ఆల‌య ద‌ర్శ‌నానికి రావ‌డం ఇది రెండోసారి అని సీఎం కేసీఆర్ తెలిపారు. డీఎంకే ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత రంగ‌నాథ‌స్వామిని ద‌ర్శించుకోవ‌డంతో ఇదే తొలిసారి అని చెప్పారు. ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ఇదివరకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో విసృత సంప్రదింపులు జరిపిన సంగతి తెలిసిందే. ఇప్పుడు స్టాలిన్‌తో మంతనాలు సాగించారు. నీట్ పరీక్షపై స్టాలిన్ కేంద్ర ప్రభుత్వంపై గుస్సా మీదున్నారు. పరీక్షను ప్రాంతీయ భాషలో రాసే అవకాశం ఇవ్వాలని కోరారు. ఇప్పుడు స్టాలిన్‌తో కేసీఆర్ జరిపిన మంతనాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇదీ ఫ్రంట్‌కు ముందడుగు అని పొలిటికల్ ఆనలిస్టుల భావన.

English summary
telangana cm kcr invite to tamilnadu cm stalin for yadadri temple reopening. next year march 28th temple is re opening.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X