భారీ వర్షంలో దీదీ గారి గరం గరం చాయ్

కోల్‌కత: పశ్చిమబెంగాల్‌లో పంచయతీ ఎన్నికల వేడి కొనసాగుతోంది. గ్రామస్థాయిలో ఏ పార్టీకి పట్టు ఉందో తేల్చి పారేసే ఎన్నికలు ఇవి. అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీ- వీటిని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవడానికి సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. ఫలితంగా అక్కడి రాజకీయాలు రసవత్తరంగా తయారయ్యాయి.

పశ్చిమ బెంగాల్‌లో 3,317 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 22 జిల్లా పరిషత్‌లలో 928 సీట్లు, 9,730 పంచాయతీ సమితి స్థానాలు, 63,229 గ్రామ పంచాయతీ వార్డుల్లో జులై 8వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. అదే నెల 11వ తేదీన ఓట్లను లెక్కిస్తారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమౌతుంది. సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. 20 జిల్లాల్లో మూడంచెలుగా పంచాయతీ ఎన్నికలు జరుగనున్నాయి.

CM Mamata Banerjee makes tea and serves it to people

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మొత్తం 2,36,464 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది. అత్యధికంగా తృణమూల్ కాంగ్రెస్ నుంచి 85,817 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీజేపీ 56,321 మంది అభ్యర్థులను రంగంలో దించింది. సీపీఎం 48,646, కాంగ్రెస్- 17,750 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వారిలో ఎవరు విజేత అనేది జులై 11వ తేదీన తేలుతుంది.

ఈ పంచాయతీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీజేపీకి ఏ ఒక్క అవకాశాన్ని కూడా ఇవ్వట్లేదు తృణమూల్ కాంగ్రెస్. తన పట్టును నిలుపుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోంది. దీనికోసం ముఖ్యమంత్రి మమత బెనర్జీ స్వయంగా రంగంలోకి దిగారు. తానే ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోన్నారు.

ఇందులో భాగంగా ఆమె ఇవ్వాళ జల్‌పాయ్‌గురి జిల్లాలో పర్యటించారు. ఒక వంక భారీ వర్షం పడుతున్నప్పటికీ లెక్కచేయలేదు. కొన్ని చోట్ల వర్షంలో తడుస్తూనే మమత బెనర్జీ ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని మాల్ బజార్‌లో ఓ టీ స్టాల్‌కు వెళ్లారు దీదీ. తన స్వహస్తాలతో టీ తయారు చేశారు. గ్లాసుల్లో పోసి మరీ అక్కడున్న ప్రజలకు అందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+