CM PA: సీఎం పీఏకి షాక్, ఈడీ సోదాల్లో రూ. 5.32 కోట్ల నగదు సీజ్, లేడీ ఐఏఎస్ ఇంటికి, టోల్ ప్లాజా !
రాంచీ: జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ పీఏకి ఈడీ అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సీఎం రాజకీయ ప్రతినిధిగా, సీఎంకు వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న వ్యక్తి టోల్ ప్లాజా కాంట్రాక్టులు ఇచ్చే విషయంలో చేతివాటం చూపించారని ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. సీఎం పీఏకి చెందిన పలు ప్రాంతాల్లో దాడులు చేసిన ఈడీ అధికారులు రూ. 5.32 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే ఈడీ అధికారుల దెబ్బతో లేడీ ఐఏఎస్ అధికారి మీద కేసు నమోదు కావడంతో ఆమెను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

సీఎం రాజకీయ ప్రతినిధి
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్ రాజకీయ ప్రతినిధిగా చాలాకాలం నుంచి పంకజ్ మిశ్రా పని చేస్తున్నారు. టోల్ ప్లాజా టెండర్లు కేటాయించే విషయంలో సీఎం హేమంత్ సోరన్ పీఏ పంకజ్ మిశ్రా చేతివాటం చూపించారని, కోట్ల రూపాయలు సంపాధించారని ఈడీ అధికారులకు సమాచారం అందింది

రూ. 5. 32 కోట్లు సీజ్
సీఎం పీఏ పంకజ్ మిశ్రాకు చెందిన ఇల్లు కార్యాలయాలు, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న వారి నివాసాలతో పాటు మొత్తం 18 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ సోదాల్లో పంకజ్ మిశ్రాకు చెందిన రూ. 5. 32 కోట్ల నగదును ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారని వెలుగు చూసింది.

లేడీ ఐఏఎస్ అధికారి సస్పెండ్
అక్రమంగా నగదు లావాదేవీలకు పాల్పడ్డారని ఇదే మే నెలలో ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్, ఆయన భర్త, ప్రముఖ వ్యాపారవేత్తకు చెందిన కార్యాలయాలు, నివాసాల్లో ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈడీ అధికారుల దెబ్బతో ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ను ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు.

అక్రమ మైనింగ్, టోల్ ప్లాజా కాంట్రాక్టుల స్కామ్
ఇప్పటికే రాంచీలోని పీఎంఎల్ కోర్టులో పూజా సింఘాల్ తోపాటు ఆమెకు సంబంధించిన వారి మీద ఎఫ్ఐఆర్ సమర్పించారు. జార్ఖండ్ లో అక్రమ మైనింగ్, టోల్ ప్లాజా కాంట్రాక్టుల్లో గోల్ మాల్ జరిగిందని ఆరోపిస్తూ ఈడీ అధికారులు దాడులు చేశారు. ఈ విషయంలో జార్ఖండ్ పోలీసులు కూడా కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications