మీ ఇంటికి మీ రేషన్: బీజేపీ పాలిత రాష్ట్రంలో జగన్ స్కీమ్: జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి
భోపాల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోన్న కొన్ని పథకాలు.. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలను ఆకర్షిస్తోన్నాయి. ప్రత్యేకించి- ఇంటింటికీ రేషన్ పథకం ఆయా రాష్ట్రాలను ఆకట్టుకుంది. కోట్లాదిమంది పేదలకు నేరుగా లబ్ది కలిగించే పథకం కావడం వల్ల దాన్ని అమలు చేయడానికి సన్నద్ధమౌతున్నాయి. తమ రాష్ట్రంలో ఈ పథకాన్ని ప్రవేశ పట్టడానికి సమాయాత్తమౌతున్నాయి.
ఒక్కొక్క రాష్ట్రంలో విస్తరిస్తోన్న ఇంటింటికీ రేషన్..
ఇప్పటికే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. కర్ణాటక సర్కార్ కూడా ఇదే బాటలో నడుస్తోంది. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పథకాన్ని ప్రారంభిస్తామంటూ ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఇదివరకే ప్రకటించారు. ఇదే జాబితాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేరింది. ఇంటింటికీ రేషన్‌ను సరఫరా చేసే పథకాన్ని ముఖ్యమంత్రి మమత బెనర్జీ ప్రారంభించారు. దువారే రేషన్ పేరుతో దీన్ని అమల్లోకి తీసుకొచ్చారు. ఈ పథకం వల్ల 10 కోట్ల మంది ప్రజలకు లబ్ది కలుగుతుందని మమత బెనర్జీ చెప్పారు.

మధ్యప్రదేశ్‌లో మొదలు..
తాజాగా మధ్యప్రదేశ్ కూడా ఈ జాబితాలో చేరింది. రేషన్ ఆప్ కె గ్రామ్ పేరుతో ఈ పథకాన్ని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రారంభించారు. తొలిదశలో 89 గిరిజన గ్రామాలు, బ్లాకులకు ఈ పథకాన్ని వర్తింపజేసింది. ఆయా గ్రామాల్లో నివాసం ఉండే కుటుంబాల వారికి ఇంటి వద్దకే నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తుంది. క్రమంగా దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరింపజేస్తుంది. గిరిజన గ్రామాల్లో ఇంటింటికీ రేషన్‌ను అందజేయడానికి ప్రత్యేకంగా 12 వాహనాలను కొనుగోలు చేసింది చౌహాన్ సర్కార్.

తొలిదశలో 89 గిరిజన గ్రామాలకు..
ఈ వాహనాల ద్వారా 89 గ్రామాలు, బ్లాకులకు రేషన్‌ను సరఫరా చేస్తుంది. ఈ వాహనాలను శివరాజ్ సింగ్ చౌహాన్ జెండా ఊపి ప్రారంభించారు. అందులో అమర్చిన ఎలక్ట్రానిక్ కాటాలను స్వయంగా పర్యవేక్షించారు. ప్రజా పంపిణీ వ్యవస్థ కింద చౌక డిపోల ద్వారా సరఫరా చేసే నిత్యావసర సరుకులను గిరిజన గ్రామాలకు పంపిణీ చేయడం సంతోషాన్ని ఇస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. దీన్ని దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.
గిరిజన యువతకు వాహనాల నిర్వహణ
ప్రతి వాహనానికీ ఇద్దరేసి చొప్పున రేషన్ సిబ్బందిని నియమించామని, ఫలితంగా- స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను కూడా కల్పించినట్టయిందని పేర్కొన్నారు. గిరిజన గ్రామాలకు రేషన్‌ను పంపిణీ చేసే వాహనాలను కొనుగోలు చేయడానికి ఆ సామాజిక వర్గానికే చెందిన యువకులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నామని చెప్పారు. దీనికి అవసరమైన మార్జిన్ మొత్తాన్ని కూడా తామే చెల్లిస్తామని హామీ ఇచ్చారు. తొలిదశలో చేపట్టిన 89 గ్రామాలకు నిర్దేశిత తేదీన ఈ వాహనాలు వెళ్తాయని, లబ్దిదారులకు రేషన్‌ను అందిస్తాయని అన్నారు.
Recommended Video

రేషన్ దుకాణాన్ని తీసుకెళ్తున్నాం..
నిత్యావసర సరుకుల కోసం కార్డుదారులెవరూ రేషన్ దుకాణాలకు వెళ్లనక్కర్లేదని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రేషన్ దుకాణాలే వారి ఇళ్ల వద్దకు వెళ్తున్నాయని, ఆ సౌకర్యాన్ని తాము కల్పించామని చెప్పారు. రేషన్ దుకాణాన్ని యూనిట్‌గా తీసుకుని ఈ పథకాన్ని రూపొందించామని పేర్కొన్నారు. గిరిజన గ్రామాల్లో.. ఒక చౌక డిపో పరిధిలో అనేక కుటుంబాలు ఉంటాయని, వాళ్లందరూ రేషన్ తెచ్చుకోవడానికి వీలు లేని పరిస్థితులు ఉన్నాయని చెప్పారు. వారు ఎదుర్కొంటోన్న సమస్యలను దృష్టిలో ఉంచుకుని రేషన్ ఆప్ కె గ్రామ్ పథకానికి శ్రీకారం చుట్టామని శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications