సీఎంకు అదే భయం, కొంప ముంచుతున్న మంత్రి పదువులు, ఎమ్మెల్యేలు !
రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలు ఎలాగైనా తమ అభ్యర్థులను గెలిపించుకోవాలని పలు పార్టీల అధినేతలు బావిస్తున్నారు. రాజ్యసభ ఎన్నికల బరిలో ఉన్న నాయకులు ఇప్పటికే ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకోవాలని ప్రయత్నించారు.
కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలతో పాటు ముగ్గురు స్వతంత్ర పార్టీల ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఇప్పటికే డీసీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఇక బీజేపీకి 66 మంది ఎమ్మెల్యేలు, జేడీఎస్ కు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు.

ఇక బీజేపీ, జేడీఎస్ కూటముల నుంచి ఇద్దరు అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముగ్గురు అభ్యర్థులను గెలిపించుకుంటామని ధీమాగా ఉంది. ఇదే సమయంలో సిద్దరామయ్య ప్రభుత్వం మీద గుర్రుగా ఉన్న కొందరు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మద్దతుతో ఇద్దరు అభ్యర్థులను గెలిపించుకోవాలని బీజేపీ, జేడీఎస్ పార్టీల నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారని తెలిసింది.
గతంలో రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన కుపేంద్ర రెడ్డి ఈసారి కూడా రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అయితే కుపేంద్ర రెడ్డికి అనుకున్నంత మంది ఎమ్మెల్యేల మద్దతు లేకపోయినా క్రాస్ ఓటింగ్ మీద ఆయన ఆశలుపెట్టుకున్నారని తెలిసింది. ప్రముఖ వ్యాపారవేత్త అయిన కుపేంద్ర రెడ్డి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పని చేసిన వైఎస్ రాజశేఖర్ రెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో కుపేంద్ర రెడ్డి విజయం సాధిస్తారా ?, లేక చివరికి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఆయనకు సినిమా చూపిస్తారా ? అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇప్పటికే సీఎం సిద్దరామయ్య, డీకే శివకుమార్ పలు సూచనలు చేశారని, ప్రత్యర్థి పార్టీల ఆఫర్లకు లొంగితే ముందుముందు లేనిపోని సమస్యలు ఎదుర్కోవలసి వస్తుందని, పార్టీ నియమాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారని తెలిసింది. ఇప్పుడు అందరి కళ్లు కర్ణాటకలో జరిగే రాజ్యసభ ఎన్నికల మీదపడింది.












Click it and Unblock the Notifications