వీడియో: సిద్ధరామయ్య.. కళాకారుడే: అద్దిరిపోయిన డాన్స్ మూమెంట్స్
బెంగళూరు: కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలు 2023 ఆరంభం అయ్యాయి. నెల రోజుల పాటు కొనసాగనున్నాయి. ప్రతి సంవత్సరం నవంబర్ 1వ తేదీన రాష్ట్రావతరణ వేడుకలను నెలరోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అటు ప్రభుత్వం, ఇటు కన్నడ సంఘాలు.. రాష్ట్రవ్యాప్తంగా దశలవారీగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటాయి.
ఈ నెల రోజుల పాటు కన్నడ నాట పండగలా రాజ్యోత్సవ వేడుకలు కొనసాగుతాయి. వేర్వేరు నగరాల్లో ప్రత్యేక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుంటాయి కన్నడ సంఘాలు. సాహిత్యం, సాంస్కృతిక, జానపద, కళా ప్రదర్శనలను నిర్వహిస్తుంటాయి. కళాకారులు వీధి ప్రదర్శనలూ చేపడుతుంటారు.

కర్ణాటక సంభ్రమ 2023 పేరుతోబళ్లారి జిల్లాలోని హంపి సహా రాష్ట్రంలోని అన్ని చారిత్రక కట్టడాలు, పర్యాటక కేంద్రాలను విద్యుద్దీపాలతో అలంకరించింది ప్రభుత్వం. మంగళూరు, ఉడుపి, కుందాపురా వంటి సముద్ర తీర ప్రాంతాల్లోని పర్యాటక స్థలాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తోంది.
#WATCH | Karnataka CM Siddaramaiah dances with artists during an event organized by the Department of Kannada and Culture in Hampi.
— ANI (@ANI) November 2, 2023
(Source: CMO) pic.twitter.com/tIif95NxDk
ఇందులో భాగంగా గురువారం రాత్రి హంపిలో నిర్వహించిన వేడుకలుకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కీలక ప్రసంగం చేశారు. కన్నడ భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకుంటూ దేశంలోనే కర్ణాటక అగ్రగామిగా ఎదుగుతోందని అన్నారు.

ఈ సందర్భంగా కళాకారులతో కలిసి సిద్ధరామయ్య డాన్స్ చేశారు. ఈనయ శంభులింగవే.. అనే సంప్రదాయబద్ధమైన జానపద నృత్యానికి ఆయన స్టెప్పులేశారు. వరుణ నియోజకవర్గానికి చెందిన కళాకారులను హంపికి ఆహ్వానించారు. తన సహచరుల కలిసి సుమారు అయిదు నిమిషాల పాటు డాన్స్ చేశారు.












Click it and Unblock the Notifications