స్వామీజీకి భారతరత్న ఎందుకు ఇవ్వలేదు ?, ఎల్ కే అద్వాని విషయంలో సిద్దరామయ్య, డీకే క్లారిటీ !
భారతదేశంలో అత్యుత్తమ రాజకీయ నాయకులలో ఒకరైన బీజేపీ భీష్ముడు, మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించారు. దేశ అత్యున్నత పౌర పురస్కారానికి అర్హులైన ఎల్ కే అద్వాని భారతరత్న పౌర పురస్కారానికి ఎంపికయ్యారని బీజేపీ నేతలు సంబరాలు చేసుకున్నారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న ప్రకటించడాన్ని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేతో సహా ప్రతిపక్ష నేతలు కూడా స్వాగతించారు.
దీనిపై కర్ణాటక కాంగ్రెస్ నేతలు కూడా స్పందించారు. కర్ణాటకలోని సిద్ధగంగ మఠానికి చెందిన శ్రీ శివకుమార్ స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీసీఎం డీకే శివకుమార్‌లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇదే విషయంపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడారు. ఎల్ కే అద్వానికి భారతరత్న ఇవ్వండని, ఇవ్వకూడదని ఎవరు చెప్పలేదని, ఎల్ కే అద్వానికి భారతరత్న ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. అయితే సిద్దగంగ మఠానికి చెందిన డాక్టర్ శివకుమార్ స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని తాను కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశానని, కానీ స్వామీజీకి భారతరత్న ఇవ్వలేదని సీఎం సిద్దరామయ్య విచారం వ్యక్తం చేశారు.

ఎల్ కే అద్వానీకి భారతరత్న ఇచ్చే అంశంపై డీసీఎం డీకే శివకుమార్ స్పందిస్తూ దేశంలోని సీనియర్ రాజకీయ నాయకుడు అయిన ఎల్ కే అద్వానీకి భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నారు. తుమకూరు సిద్ధగంగా మఠాధిపతి డాక్టర్ శివకుమాక్ స్వామీజీకి కూడా భారతరత్న ఇచ్చి ఉండాల్సిందని కర్ణాటక డీసీఎం డీకే శివకుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు. సిద్దగంగ మఠం డాక్టర్ శ్రీ శివకుమార్ స్వామీజీ అన్నదాత అని, ఆయనకు కూడా గౌరవం ఇవ్వాలనే స్వామీజీకి భారతరత్న ఇవ్వాలని మా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని డీకే శివకుమార్ అన్నారు.
చాలా వినయంగా, భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని భారతరత్న ఎల్ కే అద్వాని ఓ లేఖ విడుదల చేశారు. ఇది ఒక వ్యక్తిగా నాకు దక్కిన గౌరవం మాత్రమే కాదని ఎల్ కే అద్వాని స్పష్టం చేశారు.

నా జీవితం నా దేశానికే అంకితం, నా జీవితాంతం దేశానికి సేవ చేయడానికి నేను కృషి చేస్తానని అన్నారు. నా 14 ఏళ్ల వయసులో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌లో చేరినప్పటి నుంచి నా జీవితం ఈ దేశానికే అంకితం' చేశానని ఎల్ కే అద్వానీ అన్నారు. ఈ రోజు నాతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఎల్ కే అద్వాని లేఖ లో వివరించారు. తన సన్నిహిత సహచరుడు, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయి, పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయను ఎల్ కే అద్వాని గుర్తు చేసుకుంటూ లేఖ రాశారు.












Click it and Unblock the Notifications