బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రధాని మోడీకి సీఎం సిద్దూ సవాల్: బహిరంగ చర్చకు సిద్దమా, ఎక్కడైనా, దేనికైనా రెడీ!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: బెంగళూరు నగరంలోని ప్యాలెస్ మైదానంలో ఆదివారం జరిగిన బీజేపీ పరివర్తనా ర్యాలీకి ప్రధాని నరేంద్ర మోడీ హాజరై వెళ్లిన తరువాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య మాటల యుద్దం మొదలైయ్యింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. సీఎం సిద్దూ అయితే బహిరంగ చర్చకు సిద్దామా అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సవాలు విసిరారు.

Recommended Video

Modi At Bengaluru : Congress Talks Of ‘Ease Of Doing Crimes'
కమిషన్ ప్రభుత్వం

కమిషన్ ప్రభుత్వం

కర్ణాటకలోని సిద్దరాయ్య ప్రభుత్వం 10 శాతం కమీషన్ల ప్రభుత్వం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆరోపించారు. సిద్దరామయ్య ప్రభుత్వం మొత్తం అవినీతి మయం అయ్యింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి కన్నడిగులు సిద్దంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

సీఎం సిద్దూ ఫైర్

సీఎం సిద్దూ ఫైర్

బెంగళూరుకు ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయిన తరువాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. అవినీతి గురించి బహిరంగంగా చర్చించడానికి మీరు సిద్దం కావాలని మంగళవారం సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి నేరుగా సవాలు చేశారు.

మోడీ నోట ఆ మాట

మోడీ నోట ఆ మాట

ప్రధాని నరేంద్ర మోడీ నోట అవినీతి అనే మాట రావడంతో, దాని గురించి ఎక్కువ మాట్లాడటం తనకు చాల సంతోషంగా ఉందని సీఎం సిద్దరామయ్య అన్నారు. అదే అవినీతి గురించి మనం బహిరంగ చర్చకు వస్తే బాగుంటుందని సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోడీకి సూచించారు.

ప్రధాని మోడీకి సవాల్

ప్రధాని మోడీకి సవాల్

మొదట లోక్ పాల్ ను నియమించండి, న్యాయమూర్తి లోయా ఎలా చనిపోయారు అని దర్యాప్తు చేయించండి, బీజేపీ చీఫ్ అమిత్ షా కుమారుడు జాయ్ షా కంపెనీలకు విరుద్దంగా చర్యలు తీసుకోండి, క్రిమినల్ నేపథ్యం లేని వ్యక్తి, జైలుకు వెళ్లని వ్యక్తిని కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సీఎం సిద్దరామయ్య సవాలు చేశారు.

బీజేపీ, కాంగ్రెస్ వార్

బీజేపీ, కాంగ్రెస్ వార్

ప్రధాని నరేంద్ర మోడీ బెంగళూరులో నిషాలో మాట్లాడి ఉంటారని కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ చార్జ్, బహుబాష నటి రమ్య ట్వీట్ చేసి కొత్త వివాదానికి తెరలేపారు. ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున ఆరోపణలు, విమర్శలకు దిగుతున్నారు.

English summary
Karnataka Chief minister Siddaramaiah has tweeted prime minister Narendra modi to open discussion on corruption.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X