ఉచిత ప్రయాణం వేళ.. మహిళల సౌకర్యం కోసం కొత్త బస్సులు

KSRTC: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో కీలకమైనది- ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది సిద్ధరామయ్య ప్రభుత్వం. లగ్జరీ, ఏసీ బస్సులు మినహా- మిగిలిన ఎక్స్‌ప్రెస్ బస్సులన్నింట్లోనూ ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

బెంగళూరు సిటీ బస్సులతో పాటు కేఎస్ఆర్టీసీ, ఈశాన్య ఆర్టీసీ, వాయవ్య ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించింది. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్ఆర్టీసీ), బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (బీఎంటీసీ), నార్త్ వెస్ట్ కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఎన్‌డబ్ల్యూ ఆర్టీసీ), కళ్యాణ కర్ణాటక/నార్త్ ఈస్ట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (ఈశాన్య ఆర్టీసీ) బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.

CM Siddaramaiah launches new KSRTC buses in Bengaluru

గత ఏడాది అమలులోకి వచ్చిన ఈ పథకాన్ని కోట్లాదిమంది మహిళా ప్రయణికులు వినియోగించుకుంటోన్నారు. ఉచిత ప్రయాణం వల్ల ఆర్టీసీపై పడుతున్న భారాన్ని భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని రీఎంబర్స్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీన్ని వార్షిక బడ్జెట్‌లోనూ పొందుపరిచింది.

అదే సమయంలో- మహిళల ప్రయాణ సౌకర్యాన్ని మరింత మెరుగుపర్చడానికి కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఇదివరకు 2,000 వరకు కొత్త సిటీ బస్సులను బెంగళూరులో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పుడున్న స్టాఫ్‌పై భారాన్ని తగ్గించడానికి అదనంగా డ్రైవర్లు, కండక్టర్ల ఖాళీలను సైతం భర్తీ చేసింది.

CM Siddaramaiah launches new KSRTC buses in Bengaluru

ఇప్పుడు తాజాగా మరో వంద ఎక్స్‌ప్రెస్ బస్సులను కొనుగోలు చేసింది కేఎస్ఆర్టీసీ. నాన్- ఏసీ బస్సులు ఇవి. మహిళలకు మరింత మెరుగైన ప్రయాణ వసతిని కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకుంది సిద్ధరామయ్య సర్కార్. వీటికి అశ్వమేధ క్లాసిక్‌ అని పేరు పెట్టింది. రద్దీ రూట్లల్లో పాయింట్ టు పాయింట్ సర్వీస్‌గా వాటిని నడిపించనుంది.

కొద్దిసేపటి కిందటే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి ఈ బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. బెంగళూరు విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన. బస్సు టెక్నికల్ డీటెయిల్స్‌ను అడిగి తెలుసుకున్నారు. కొంతదూరం అందులో ప్రయాణించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+