మోదీ మాత్రం ప్రధాని కాలేరు, నా సీఎం కుర్చీ ఎవరిదంటే ?, సీఎం సంచలనం, ఆకుర్చీ వదలరా ? !
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో దేశంలోని అన్ని పార్టీల అభ్యర్థులు తమతమ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుపై ఉత్కంఠ నెలకొంది. దీనిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. సీఎం మార్పు విషయంలో సిద్దరామయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది.
ముఖ్యమంత్రి పదవిని డీకే శివకుమార్‌ను వదులుకోవాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటే అదే పదవిలో తాను కొనసాగుతానని, లేకుంటే హైకమాండ్ నిర్ణయం మేరకు తాను నడుచుకుంటానని, . నాలుగేళ్ల తర్వాత తాను పదవిలో ఉండనని, ప్రత్యక్ష రాజకీయాల్లో పోటీ చెయ్యనని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చెయ్యకపోయినా క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సీఎం సిద్దరామయ్య అన్నారు.

2023 మే 20వ తేదీన కర్ణాటక రాష్ట్రంలో బీజేపీని అధికారం నుండి తప్పించిన కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో విజయ పతాకాన్ని ఎగురవేసింది, ఆ తర్వాత సీఎం సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ రాజీ చర్చలు జరిపి డీకే శివకుమార్ కు నచ్చచెప్పి ఆయనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు.
కొన్ని రాజీ నిర్ణయాల తర్వాత సిద్దరామయ్య, డీకే శివకుమార్ ల మధ్య రాజీ కుదిరిందని, దాని ప్రకారం రెండున్నరేళ్ల తర్వాత డీకే శివకుమార్ సీఎంగా బాధ్యతలు చేపడతారని కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే ఈ విషయాన్ని ఇంత వరకు కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఎక్కడా అధికారికంగా ధృవీకరించలేదు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి భారీ మెజారిటీతో విజయం సాధించి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని కర్ణాటక సీఎం సిద్దరామయ్య జోస్యం చెప్పారు.
కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఎన్‌డీఏకు సరిపడా సీట్లు రావని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. అలాగే కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉండదని సిద్దరామయ్య ధీమాగా చెప్పారు. కావాలంటే లోక్ సభ ఎన్నకల ఫలితాలు వచ్చాక మీరే చూస్తారని సిద్ధరామయ్య అన్నారు. తనకు ఉన్న సమాచారం ప్రకారం బీజేపీ 200 కంటే ఎక్కువ సీట్లు దాటదని అన్నారు
బీజేపీ కేంద్రంలో సొంత బలంతో అధికారంలోకి రాలేదని సిద్దరామయ్య ధీమాగా అన్నారు. అలాగే లోక్ సభ ఎన్నికల తర్వాత ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో పాటు దక్షిణాదిలోని ఇతర ప్రాంతీయ పార్టీల నాయకులు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని సిద్ధరామయ్య జోస్యం చెప్పారు. అయితే సిద్దరామయ్య మాటలను బీజేపీ నాయకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు.
-
సమ్మర్ లో ఈ ప్రాంతాలకు వెళ్తే రావాలనిపించదు.. తక్కవ బడ్జెట్ లో ఇలా చుట్టేయండి.. -
PM Modi: సీఎంలకు మోడీ సందేశం ఇదే..! మళ్లీ ఆ కోవిడ్ మోడల్..! -
సంక్షోభం వస్తే మీ సన్నద్ధత ఎంత ? సీఎంల భేటీలో ప్రధాని మోడీ..! -
రేవంత్ కు కేంద్రం బంపర్ బొనాంజా , 2028 తర్వాతా - మారుతున్న లెక్కలు..!! -
మోదీ-ట్రంప్ వార్ ఫోన్ కాల్ మధ్యలో మస్క్- షాకింగ్ ట్విస్ట్ -
కర్ణాటకలో సంచలన తీర్పు: నిర్లక్ష్యంపై సీరియస్.. -
రేపే ఐపీఎల్ ఓపెనర్: మెట్రో రైల్ లో ఫ్రీ ట్రావెల్: మంత్రులకూ -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications