మోదీ ఏ ముఖం పెట్టుకుని వస్తారు ?, జీవితాంతం అపద్దాలే చెప్పారు, సీఎం సంచలన వ్యాఖ్యలు !
లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మైసూరుకు వస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారు?, ప్రధాని మోదీ కాని, బీజేపీ ఎంపీలు కాని మైసూరుకు ఏం చేశారు అని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ప్రశ్నించారు. ప్రధాని మోదీ కాని, మైసూర్ ఎంపీలు కాని ఈ నగరానికి ఏం చేశారో బహిరంగంగా ప్రజలకు చెప్పాలని సీఎం సిద్దరామయ్య బీజేపీని నిలదీశారు.
పదేళ్లుగా కేవలం అబద్ధాలు చెప్పి కాలం గడిపేసిన ప్రధాని మోదీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల కోసం ఓట్లు అడగడానికి వస్తున్నారు అని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. మైసూరు-కొడగు లోక్‌సభ నియోజకవర్గం కృష్ణరాజలో జరిగిన జనధ్వని-2 యాత్ర జనసమ్మేళనం కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించిన సీఎం సిద్దరామయ్య ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకుల మీద విరుచుకుపడ్డారు.

మైసూరులో బీజేపీ ఓట్లు వెయ్యాలని ఏ ముఖం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతున్నారని సీఎం సిద్దరామయ్య ప్రశ్నించారు. ఇదే సమయంలో బీజేపీ నాయకులు పచ్చి అపద్దాలు మాట్లాడుతున్నారని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి భారతీయుడి ఖాతాకు రూ 15 లక్షలు బదిలీ చేస్తామని, విదేశాల్లోని నల్లధనం భారత్ కు తీసుకు వస్తామని, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రధాని మోదీ గతంలో హామీలు ఇచ్చారని సిద్దరామయ్య ఆరోపించారు.
వీటిలో ఏ హామీ నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోదీ డీజిల్,పెట్రోల్,గ్యాస్, ఎరువుల ధరలు తగ్గిస్తారు అనుకుంటే వాటి ధరలు విపరీతంగా పెంచేశారని సీఎం సిద్దరామయ్య ఆరోపించారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ పెరుగుతుందని మోదీ పచ్చి అపద్దాలు చెప్పారని సిద్దరామయ్య ఆరోపించారు. ఇలా ఎన్నో అబద్ధాలు చెప్పి భారతీయులను నిరంతరం మోసం చేస్తున్న మోదీకి ఈసారి లోక్ సభ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పాలని సీఎం సిద్దరామయ్య ఓటర్లకు మనవి చేశారు.
పదేళ్లుగా మోసం చేసిన వారికి మీరు మరోసారి ఓటు వేస్తారా అని సీఎం సిద్దరామయ్య ప్రజలను ప్రశ్నించారు. మైసూరులోని ప్రతి మేధావికి ఎవరు ఎలాంటి వాళ్లో తెలుసు అని సిద్దరామయ్య అన్నారు. జయదేవ ఆసుపత్రిని ఎవరు కట్టారు, మహిళలు, చిన్న పిల్లల ఆసుపత్రిని ఎవరు కట్టారు, పాఠశాలలు, హాస్టళ్లను ఎవరు నిర్మించారు, మైసూరు అభివృద్ధికి ఏ ప్రభుత్వం ఎన్ని వేల కోట్లు ఇచ్చిందో మీఅందరికి తెలుసు, వాటిని గుర్తు పెట్టుకుని ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఓటు వెయ్యాలని సిద్దరామయ్య మనవి చేశారు.
బీజేపీకి కూడా మనం చేసినంత పని చేసే అవకాశం వచ్చింది. ప్రజలు వారికి అవకాశం ఇచ్చారు. కానీ ఈ అవకాశం వచ్చినా బీజేపీ ఎంపీలు పని చేయలేదు కాబట్టి మాకు చెప్పినట్లు చేసే అవకాశం ఇవ్వండి, అభివృద్ధి దిశలో ముందుకు సాగండి, పోరాటాలు, నిరసనలతో సామాన్య కార్మికుడిగా ఎదిగిన మైసూరు కాంగ్రెస్ పార్టీ ఎం.లక్ష్మణ్ ను ఈసారి ఎంపీగా గెలిపించాలని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ మీద పదేపదే ఆరోపణలు చేసిన సీఎం సిద్దరామయ్య బీజేపీ మీద విరుచుకుపడ్డారు.












Click it and Unblock the Notifications