కర్ణాటక బడ్జెట్: ఉచితాల భారం రూ.52,000 కోట్లు: నిరుద్యోగులకు పికప్ వ్యాన్లు

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అయిదు హామీలు అతి కీలకమైనవి. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ప్రతి ఇంటికీ ప్రతి నెలా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ప్రతి మహిళకూ ప్రతినెలా 2,000 రూపాయల నగదు బదిలీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికీ 10 కేజీల ఉచిత బియ్యం.. వంటివి ఇందులో ఉన్నాయి.

ఈ పరిణామాల మధ్య సిద్ధరామయ్య సర్కార్.. ఇవ్వాళ వార్షిక బడ్జెట్‌ను ప్రతిపాదించింది. ఆర్థిక శాఖను పర్యవేక్షిస్తోన్న ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బడ్జెట్ ప్రతిపాదనలను సభలో ప్రవేశపెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన మొదటి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రతిపాదనలు ఇవి.

siddaramaiah7

బడ్జెట్ మొత్తం వ్యయం 3,27,747 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,50,933 కోట్ల రూపాయలు. మూలధన వ్యయం 54,374 కోట్ల రూపాయలు, రుణాల చెల్లింపు కింద 22,441 కోట్ల రూపాయలు. అత్యధికంగా విద్యారంగానికి రూ.37,587 కోట్లను కేటాయించింది సిద్ధరామయ్య ప్రభుత్వం.

మొత్తం బడ్జెట్‌లో విద్యారంగానికి కేటాయించిన వాటా 11 శాతం. మహిళా- శిశు సంక్షేమానికి రెండో ప్రాధాన్యతను ఇచ్చింది. దీనికి రూ.24,166 కోట్లను ఈ వార్షిక బడ్జెట్‌లో ప్రతిపాదించింది. మొత్తం బడ్జెట్ కేటాయింపుల్లో మహిళా శిశు సంక్షేమానికి కేటాయించిన వాటా ఏడు శాతం. ఆరోగ్యం, కుటుంబ సంక్షేమానికి నాలుగు శాతం నిధులను మంజూరు చేసింది. దీని విలువ 14,950 కోట్ల రూపాయలు.

siddaramaiah

ఎన్నికల్లో ఇచ్చిన అయిదు ఉచిత పథకాలను అమలు చేయడానికి ప్రత్యేకంగా కోసం 52,000 కోట్ల రూపాయలను కేటాయించింది ప్రభుత్వం. ఈ అయిదు ఉచిత పథకాల వల్ల రాష్ట్రవ్యాప్తంగా కోటి 30 లక్షల కుటుంబాలు లబ్దిపొందుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. వ్యవసాయ రంగానికీ సమాన ప్రాధాన్యతను ఇచ్చింది.

గతంలో బీజేపీ ప్రభుత్వం వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్ (ఏపీఎంసీ) యాక్ట్‌లో చేసిన సవరణలను ఉపసంహరిస్తున్నట్లు సిద్ధరామయ్య ప్రకటించారు. శివమొగ్గ, చిక్‌మగళూరు, హాసన్, దక్షిణ కన్నడ, కొడగు, ఉత్తర కన్నడ, ఉడుపి జిల్లాల్లో వ్యవసాయోత్పత్తులను రవాణా చేయడానికి పికప్ వ్యాన్లను కొనుగోలు చేయడానికి ఏడు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందజేస్తామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+