వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోరెన్ నిర్ణయం పై ఉత్కంఠ - బల నిరూపణ : సీఎంగా భార్య కల్పనాకు ఛాన్స్..!!

|
Google Oneindia TeluguNews

జార్ఖండ్ లో ఏం జరగబోతోంది. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తన పదవికి రాజీనామా చేస్తారా. బల నిరూపణ వెనుక అసలు వ్యూహం ఏంటి. కొద్ది రోజులుగా జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ కొనసాగే అంశం పైన ఉత్కంఠ కొనసాగుతోంది. హేమంత్​పై అనర్హత వేటు తప్పదన్న వార్తల నేపథ్యంలో ఝార్ఖండ్ రాజకీయాల్లో కొంతకాలంగా అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వం భవిష్యత్​ ఊగిసలాటలో ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

సీఎం సోరెన్ ముందస్తు వ్యూహాలు

సీఎం సోరెన్ ముందస్తు వ్యూహాలు

ముందస్తు పరిణామాలను అంచనా వేసిన సోరెన్ తన వ్యూహాలను పదును పెట్టారు. తన శాసనసభ్యత్వాన్ని గవర్నర్​ రద్దు చేస్తే ప్రభుత్వం కూలకుండా ఉండేందుకు సోరెన్‌ ముందుగానే సిద్దమయ్యారు. జేఎంఎం ఎమ్మెల్యేలను ఛత్తీస్​గఢ్​ తరలించారు. 81 మంది సభ్యులున్న ఝార్ఖండ్‌ అసెంబ్లీలో సోరెన్‌ సర్కారుకు 49 మంది సంఖ్యాబలం ఉంది. సంకీర్ణ ప్రభుత్వంలో 30 మంది ఎమ్మెల్యేలతో ఝార్ఖండ్‌ ముక్తి మోర్చా అతిపెద్ద పార్టీగా ఉండగా.. కాంగ్రెస్‌కు 18 మంది, ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. భాజపాకు 26 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

ప్రభుత్వం కొనసాగేలా కసరత్తు

ప్రభుత్వం కొనసాగేలా కసరత్తు

ఇదే సమయంలో రేపు (సోమవారం) సోరెన్ సభలో తన బల నిరూపణ ద్వారా తాను పదవి నుంచి తప్పుకున్నా.. తన ప్రభుత్వానికి ఢోకా లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. హేమంత్‌ శాసనసభ్యత్వంపై అనర్హత వేటువేసినా కూటమికి తగినంత మెజార్టీ ఉందని, ఆ ప్రభావం ప్రభుత్వంపై ఉండదని ప్రభుత్వంలోని ముఖ్యులు చెబుతున్నారు. సోరెన్ తన ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని నిరూపించుకోనున్నారు. ఈ మేరకు శాసనసభ కార్యదర్శి ఎమ్మెల్యేలకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష బీజేపీ కూడా సమావేశాలకు సిద్ధమవుతున్నది.

సోరెన్ సతీమణికి సీఎంగా ఛాన్స్

సోరెన్ సతీమణికి సీఎంగా ఛాన్స్

అయితే, సభలో విశ్వాస పరీక్ష ముందు అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం ఉందనే ప్రచారమూ సాగుతోంది. సభలో బల నిరూపణకు ముందు గవర్నర్ పాత్ర కీలకంగా మారుతోంది. దీంతో..ఈ పరిస్థితుల నడుమ హేమంత్​ సోరెన్ ఒకవేళ రాజీనామా చేస్తే​ ఆయన భార్య కల్పనా సోరెన్​ను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే అవకాశాలున్నట్లు సమాచారం. దీంతో..ఇప్పుడు సడన్ గా దేశ రాజకీయాల్లో జార్ఖండ్ పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.

English summary
Amid suspense over continuation of the Jharkhand Chief Minister as an MLA, Hemant Soren will seek a vote of trust.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X