సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం- మణిపూర్ మండుతున్న వేళ..!!

చెన్నై: మణిపూర్‌లో చెలరేగిన హింస చల్లారట్లేదు. రెండున్నర నెలలుగా ఈ ప్రశాంత రాష్ట్రం మండిపోతూనే వస్తోంది. మెయితీ, కుకీ సామాజిక వర్గాల మధ్య మొదలైన రిజర్వేషన్ అంశం రోజురోజుకూ తీవ్రరూపాన్ని దాల్చుతూనే ఉంది. దీనికి అడ్డుకట్ట వేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపినప్పటికీ.. ఏ మాత్రం ఫలితం ఉండట్లేదు.

మణిపూర్‌లో నెలకొన్న ఈ ఉద్రిక్త పరిస్థితులు అక్కడి అథ్లెట్లు, క్రీడాకారులు తీవ్ర ఆటంకాలుగా పరిణమించాయి. త్వరలో జరగబోయే ఆసియా గేమ్స్‌లో పాల్గొనాల్సి ఉంది. అలాగే- ఖేలో ఇండియా ఈవెంట్స్‌లోనూ వారు భాగస్వామ్యులు కావాల్సి ఉంది. ఈ ఏడాది జరగబోయే ఆసియా గేమ్స్‌కు చైనా ఆతిథ్యాన్ని ఇస్తోంది. హౌంగ్ఝౌలో సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు ఆసియా గేమ్స్ జరుగనున్నాయి.

 CM Stalin assures to Manipur sportspersons to train them

ఆసియన్ ఒలింపిక్స్‌గా భావించే ఆసియా గేమ్స్‌లో పాల్గొనడానికి మణిపూర్ అథ్లెట్లు, క్రీడాకారులు సన్నద్ధం కావాల్సిన ఈ దశలో అక్కడ హింసాత్మక పరిస్థితులు చెలరేగుతోండటం ఆందోళనకు గురి చేస్తోంది. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాల పంటను పండించిన పలువురు క్రీడాకారులు ఈ రాష్ట్రానికి చెందిన వారే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

మేరీ కోమ్, చాను సైఖోమ్ మిరాబాయి, కుంజారాణి దేవి, సుశీల చాను, కల్పన దేవి, బోయిథంగ్ హావోకిప్, దేవేంద్రో సింగ్, సుశీలాదేవి, అనూరాధ థొక్చోమ్.. వంటి స్టార్ అథ్లెట్లు ఆయా స్పోర్ట్స్ ఈవెంట్ల కోసం సన్నద్ధం కావాల్సి ఉంది. పతకాలను సాధించాలంటే శిక్షణ తప్పనిసరి. మణిపూర్‌లో నెలకొన్న పరిస్థితులు దీనికి అనుకూలంగా లేవు. అడుగు బయటపెట్టలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. శిక్షణ తీసుకునే అనుకూల వాతావరణం అక్కడ ఉండట్లేదు.

ఈ నేపథ్యంలో- తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. మణిపూర్‌కు చెందిన అథ్లెట్లు, క్రీడాకారులకు తాము శిక్షణ ఇస్తామని ప్రకటించారు. ఆ రాష్ట్రానికి చెందిన అథ్లెట్లు, ఇతర క్రీడారంగాలకు చెందిన వారందరికీ తాను సాదర స్వాగతం పలుకుతున్నానని పేర్కొన్నారు.

తమ రాష్ట్రంలో ఏ లోటూ రానివ్వకుండా చూసుకుంటామని స్టాలిన్ హామీ ఇచ్చారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మానవులందరూ సమానమేనని తాము భావిస్తోన్నామని, తమ రాష్ట్రంలో ఎలాంటి కుల, మతాల పట్టింపులు లేవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరినీ సోదర సమానులుగా భావిస్తాని, అందరినీ అక్కున చేర్చుకుంటామని వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+