బొగ్గు కొరత: పడిపోతున్న నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం.. దేశంలో ఇలా.. తెలుగు రాష్ట్రాల్లో లెక్కలివే...

విద్యుత్ ఉత్పత్తి బొగ్గు లేదంటే నీటితో అవుతుంది. అయితే వర్షాకాలంలో అయితే హైడల్ ప్రొడక్షన్ బాగుంటుంది. వేసవిలో అయితే థర్మల్ మీద ఆధారపడాల్సిందే. అయితే దేశంలో బొగ్గు సంక్షోభం ఏర్పడబోతుంది. దీంతో విద్యుత్ కోతలు తప్పేలా ఉండటం లేదు. బొగ్గు కొరత వల్ల థర్మల్ పవర్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. దేశంలో 150 థర్మల్ పవర్ స్టేషన్లు ఉంటే 81 కేంద్రాల్లో స్టాక్ తీవ్రస్థాయికి చేరిందని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది. దీంతో గృహవసరాలకు విద్యుత్ వినియోగం ప్రమాదంలో పడింది. ప్రైవేట్ థర్మల్ పవర్ స్టేషన్లలో కూడా ఇదే పరిస్థితి ఉంది. మొత్తం 54 ప్లాంట్లలో 28 కేంద్రాల్లో క్రిటికల్ స్థాయికి చేరిందని వివరించింది.

9 రోజుల వరకు నిల్వలు

9 రోజుల వరకు నిల్వలు

ఏప్రిల్ మధ్య వరకు కేవలం 9 రోజులు బొగ్గు నిల్వలు ఉన్నాయి. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. ఈ లోపు బొగ్గు సరఫరా అందకుంటే ఇబ్బందులు తప్పవు. ఈ విషయాన్ని ఆల్ ఇండియా పవర్ ఇంజినీర్స్ ఫెడరేషన్ కూడా చెబుతుంది.

ఉత్తరప్రదేశ్ పవర్ ప్లాంట్‌లలో మరో 7 రోజుల్లో బొగ్గు సరిపోనుంది. హర్యానాలో 8, రాజస్థాన్‌లో 17 రోజులు మాత్రమే ఉండనుంది. కానీ 26 రోజుల నిల్వ అందుబాటులో ఉంచాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మద్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, జార్ఖండ్, ఛత్తీస్ గడ్‌లో కూడా ఇలాంటి పరిస్థితి ఉందని వివరించారు.

డిమాండ్ ఇదీ..

డిమాండ్ ఇదీ..

ఈ నెల 19వ తేదీన లక్ష 88 వేల 14 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ ఉంది అని చెప్పారు. అత్యవసర సమయంలో అదీ 4469 మెగావాట్లుగా ఉందని చెప్పారు. గతేడాది జూలైలో 2 లక్షల 570 మెగావాట్ల డిమాండ్ ఉందని గుర్తుచేశారు. అయితే కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం ధీమాతో ఉన్నారు. 72.5 టన్నుల బొగ్గు నిల్వ ఉందని చెబుతున్నారు.

సీఐఎల్, వాషరీస్, కాప్టివ్ బ్లాక్స్ వద్ద ఉందని చెప్పారు. ఇప్పటివరకు దేశంలో బొగ్గు కొరత లేదని.. విద్యుత్ కొరత ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు. 2021-22లో బొగ్గు దిగుమతులు తగ్గించడంతో పవర్ ప్లాంట్లు బొగ్గు కొరత ఎదుర్కొంటున్నాయి. దేశంలో ఈ ఏడాది 25 మిలియన్ల టన్నుల దిగుతుతి చేసుకుంది. గతేడాదితో పోలిస్తే ఇదీ 50 శాతం మాత్రమే ఉంది.

ఏపీలో విద్యుత్ కొరత

ఏపీలో విద్యుత్ కొరత

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్ కొరత ఉంది. తెలంగాణలో కాస్త పర్లేదు. ఏపీలో అయితే పరిశ్రమలకు పవర్ హాలీడే కూడా ప్రకటించారు. కానీ ఆ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రస్తుతం నెలకొన్న విద్యుత్ కొరత తాత్కాలికమేనని అంటోంది. మే ఒకటి నుండి విద్యుత్ సరఫరా సాధారణ స్థితికి చేరుకుంటుందని చెబుతోంది.

కృష్ణపట్నంలో మరో నెలలో 800 మెగావాట్లు, ఎన్టీటీపీఎస్ లో మరో మూడు, నాలుగు నెలల్లో 800 మెగావాట్ల సామర్థ్యం గల యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టచేసింది. కొత్తగా మరో 6000 మెగావాట్ల హైడల్ సామర్థ్యం గల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్దం చేశామని తెలిపింది.

150 మిలియన్ యూనిట్లే..

150 మిలియన్ యూనిట్లే..

రాష్ట్రంలో రోజువారీ డిమాండ్ 235 మిలియన్ యూనిట్లు ఉండగా కేవలం 150 మిలియన్ యూనిట్ల విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉంది. దీంతో రోజు 55 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ కొరత ఏర్పడింది. 30 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ ను విద్యుత్ ఎక్స్ఛేంజీల నుంచి సమకూర్చుకుంటున్నారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలో డిమాండ్, సప్లైల మధ్య భారీగా తేడా ఉండటం వల్ల ప్రభుత్వం కొనుగోలు చేసేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ విద్యుత్ లభ్యత లేక సాధ్యపడటం లేదట.

50 శాతం లోడ్

50 శాతం లోడ్

తగినంత విద్యుత్ అందుబాటులో లేకపోవటం వల్ల నిరంతరంగా నడిచే పరిశ్రమలకు 50 శాతం లోడ్ రిలీఫ్‌ను అమలు చేస్తున్నారు. మరి కొన్ని పరిశ్రమలకు వారానికి ఒక రోజు పవర్ హాలిడేను అమలు చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకోవటం కోసం వ్యవసాయానికి పగటి పూటే 7 గంటలు పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ ను ఖచ్చితంగా సరఫరా చేస్తున్నారు. గృహ విద్యుత్ సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నారు

తెలంగాణలో పగలే త్రి ఫేజ్ పవర్.. మిగదాంతా ఓకే

తెలంగాణలో పగలే త్రి ఫేజ్ పవర్.. మిగదాంతా ఓకే

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉంది. అయితే అదీ రైతులకు అందజేసే త్రి ఫేజ్ మీద ఉంది. మిగతా గృహాలకు, పరిశ్రమలకు రెగ్యులర్‌గా కొనసాగుతుంది. ఎండలు పెరగడం.. పవర్ వినియోగం కూడా పెరిగింది. బొగ్గు కొరతతో అంతగా ఉత్పత్తి కావడం లేదు. దీంతో పంటలకు మధ్యాహ్నం 7 గంటల త్రి ఫేజ్ ఇస్తున్నారు. రాత్రి ఇవ్వడం లేదు. దీంతో రైతులు.. రాత్రి కూడా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ అదీ సాధ్య పడటం లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+