కేంద్రంపై జగన్, స్టాలిన్ పోరుబాట- ఇండియన్ పోర్ట్స్ బిల్లుపై-ఒప్పుకుంటే పోర్టుల కబ్జా

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఇండియన్ పోర్ట్స్ బిల్లుతో దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న అన్ని మేజర్, నాన్ మేజర్ పోర్టులు కేంద్రం చేతుల్లోకి వెళ్లబోతున్నాయి. దీంతో ఇప్పటివరకూ రాష్ట్రాలకు ఆర్దికంగా ఉపయోగపడుతున్న వీటి రాబడి ఇకపై కేంద్రానికి వెళ్లనుంది. అదే సమయంలో రాష్ట్రాలకు ఏ విధంగానూ మేలు కలిగే అవకాశం లేదు. ఈ బిల్లుపై 9 రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా కేంద్రం మాత్రం వెనక్కి తగ్గేందుకు సిద్దంగా లేదు. దీంతో కేంద్రం, రాష్టాల మధ్య మరో పోరు తప్పడం లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ, తమిళనాడు సీఎంలు జగన్, స్టాలిన్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

 కేంద్రం పోర్టుల కబ్జా

కేంద్రం పోర్టుల కబ్జా

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మేజర్, నాన్ మేజర్ పోర్టులపై సర్వాధికారాలు చేజిక్కించుకునేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఇప్పటివరకూ నాన్ మేజర్ పోర్టులపై రాష్ట్రాల పెత్తనం సాగుతుండగా.. ఇప్పుడు దాన్ని కబ్జా చేసేందుకు కేంద్రం పావులు కదుపుతోంది. ఇందుకోసం ఇండియన్ పోర్ట్స్ బిల్లు 2021ని ప్రతిపాదిస్తోంది. పోర్టుల రక్షణ, భద్రత, కాలుష్య నియంత్రణతో పాటు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు చెప్తున్న కేంద్రం చెబుతోంది. దీంతో ఈ బిల్లులో భాగంగా నాన్ మేజర్ పోర్టుల్లో పాలన, నియంత్రణ, నిర్వహణ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చేతుల్లోకి వెళ్లబోతోంది.

 తీర రాష్ట్రాల గొంతుకోసేలా బిల్లు ముసాయిదా

తీర రాష్ట్రాల గొంతుకోసేలా బిల్లు ముసాయిదా

ఇండియన్ పోర్ట్స్ ముసాయిదా బిల్లులో కేంద్రం పలు కీలక అంశాల్ని ప్రస్తావించింది. ముఖ్యంగా పోర్టుల రక్షణ, భద్రత, కాలుష్య నియంత్రణతో పాటు అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించేందుకు ఈ బిల్లు తీసుకొస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. పోర్టుల వ్యవహారం సరిహద్దులతో ముడిపడినందున ఆయా అంశాలను కేంద్రం తెరపైకి తెస్తోంది. కేంద్రం నిర్ణయంతో ఇకపై నాన్ మేజర్ పోర్టుల్లో పాలన, నియంత్రణ, నిర్వహణ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ చేతుల్లోకి వెళ్లనుంది. అలాగే పోర్టు సంబంధిత న్యాయవ్యవహారాల పరిధిని కేంద్రం పెంచుతోంది. అంతటితో ఆగకుండా దేశంలో ఇష్టమైన చోట ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటు చేసుకునే అధికారాన్ని, పోర్టుల్లో క్రయవిక్రయాలు చేసుకునే హక్కును స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ కు కట్టబెట్టబోతోంది. దీంతో ఇక రాష్ట్రాల అధికారం నామమాత్రం కానుంది.

 స్టేట్ కౌన్సిల్ పెత్తనం కేంద్రానిదే

స్టేట్ కౌన్సిల్ పెత్తనం కేంద్రానిదే

1908 నాటి ఇండియన్ పోర్ట్స్ చట్టం ప్రకారం ఇప్పటివరకూ స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిళ్లు రాష్ట్రాల పరిధిలో ఉన్నాయి. కానీ కేంద్రం తీసుకొస్తున్న కొత్త బిల్లుతో ఇకపై దేశవ్యాప్తంగా ఒకే స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ ఉటుంది. దీనికి కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి ఛైర్మన్ గా ఉంటారు. సభ్యులుగా రాష్ట్రాల మంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల అడ్మినిస్ట్రేటర్లు, కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులే ఉంటారు. ఇందులో రాష్ట్ర మంత్రులు మినహా మిగతా వారంతా ఎలాగో కేంద్రం పరిధిలో ఉన్న వారే. కౌన్సిల్లో మొత్తం 9 విభాగాలు ఉండగా 8 విభాగాల్లో కేంద్రంలో మంత్రులు, అధికారులు, అడ్మినిస్ట్రేటర్లు ఉండబోతున్నారు. నాన్ మేజర్ పోర్టుల కోసం రాష్ట్రాలు తమ పరిధిలో మారిటైమ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పిస్తారు

ఇవి ఏర్పాటైన తర్వాత పోర్టుల నుంచి వచ్చే అద్దెలు, వడ్డీలు, రాబడులు, సిబ్బంది అంతా కేంద్రం పరిధిలోకి వెళ్తాయి. కాబట్టి నీతి ఆయోగ్ తరహాలో కేంద్రం మాటే చెల్లుబాటు అవుతుంది. దీనిపైనే రాష్ట్రాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

 కేంద్రంపై జగన్, స్టాలిన్ ఉమ్మడి పోరు

కేంద్రంపై జగన్, స్టాలిన్ ఉమ్మడి పోరు

కొత్త చట్టం అమల్లోకి వస్తే నిర్ణయాధికారం రాష్ట్రాల నుంచి కేంద్రానికి బదిలీ కానుంది. కేంద్రం చెప్పుచేతల్లో ఉండే స్టేట్ డెవలప్ మెంట్ కౌన్సిల్ తీసుకనే నిర్ణయాలను రాష్ట్రాలు అమలు చేయాల్సి వస్తుంది. దీంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తూ 9 తీర ప్రాంత రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ లేఖలు రాశారు. అదే సమయంలో ఏపీలో సీఎం జగన్ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి కేంద్రం గురువారం నిర్వహించిన వర్చువల్ మీట్ లో అభ్యంతరాలు తెలిపారు. బిల్లు అమల్లోకి వస్తే పోర్టుల్లో రాష్ట్రాల పాత్ర నామమాత్రం అవుతుందని, దీర్ఘకాలంలో ఇది ప్రతికూల ప్రభావం చూపుతుందని స్టాలిన్ హెచ్చరికలు చేస్తున్నారు. బిల్లు ఆమోదిస్తే రాష్ట్రాలు ఆర్ధికంగా అభివృద్ధి చెందే హక్కు కోల్పోతాయని అభ్యంతరాలు వ్రధానంగా తెరపైకి వస్తున్నాయి. అయినా కేంద్రం వీటిని లెక్కచేసే పరిస్ధితుల్లో లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+