Cockroach Janta Party: బొద్దింకల పార్టీకి కేంద్రం బిగ్ షాక్..! అన్ని అకౌంట్లూ..!
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ బొద్దింక వ్యాఖ్యల నేపథ్యంలో ఆన్ లైన్ లో పుట్టుకొచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party)కి వరుస షాక్ లు తప్పడం లేదు. కేంద్ర ప్రభుత్వ తీరును, నిర్ణయాలను తప్పుబడుతూ వీడియోలు తయారు చేసి వైరల్ చేస్తుండటం, నీట్ పేపర్ లీక్ కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ సంతకాల సేకరణ చేపట్టడం వంటి చర్యలు కేంద్రాన్ని ఇరుకునపెట్టాయి. దీంతో కేంద్రం ఉక్కుపాదం మోపింది.
ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టిస్తున్న 'కాక్‌రోచ్ జనతా పార్టీ' వెబ్‌సైట్‌ను ఇవాళ తొలగించినట్లు దాని వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని, దీన్ని "నియంతృత్వ" చర్యగా ఆయన అభివర్ణించారు. యువ సోషల్ మీడియా యూజర్లలో దీప్కే డిజిటల్ ఉద్యమం వేగంగా ప్రాచుర్యం పొందింది. ప్రభుత్వ "నియంతృత్వ వైఖరిని" ఆయన ఎక్స్ వేదికగా ఆక్షేపించారు. 10 లక్షల మంది సభ్యులు వెబ్‌సైట్‌లో చేరారని, ఇది మిలీనియల్స్, జెన్ జీ యువతకు వ్యవస్థపై వ్యంగ్య, మీమ్ వేదికని దీప్కే తెలిపారు.

You can hack and withhold the accounts but you cannot hack this movement.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
We are not going to stop and we will keep raising our voice against this autocracy. Every attack makes cockroaches stronger.
We are working on a plan to get this movement to continue sustainably and take… pic.twitter.com/35mJ3hCBQo
'నీట్-యుజి పేపర్ లీక్' ఆరోపణలు దేశవ్యాప్తంగా లక్షలాది మంది వైద్య విద్యార్థులలో ఆగ్రహం రగిల్చాయి. ఈ వివాదం నడుమ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 6 లక్షల మంది "కాక్‌రోచ్ జనతా పార్టీ" సభ్యులు పిటిషన్‌పై సంతకాలు చేసినట్లు దీప్కే ప్రకటించారు. ప్రభుత్వం మా ప్రజాదరణ పొందిన వెబ్‌సైట్‌ను తొలగించింది, 10 లక్షల మంది బొద్దింకలు మా వెబ్‌సైట్‌లో సభ్యులుగా చేరారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ 6 లక్షల బొద్దింకలు ఒక పిటిషన్‌పై సంతకాలు చేశారని ఎక్స్ లో తెలిపింది.

This account @ Cockroach4India is a fake account created by BJP IT Cell and impersonating to be Cockroach Janta Party. Please report.
— Abhijeet Dipke (@abhijeet_dipke) May 23, 2026
Original accounts are @CJP_2029 @Cockroachisback pic.twitter.com/6ooJXRM0m5
ఇప్పుడు ప్రభుత్వం బొద్దింకలకు ఎందుకు భయపడుతోందని దిప్కే ప్రశ్నించారు. ఈ నియంతృత్వ వైఖరి భారతీయ యువత కళ్లు తెరిపిస్తోందన్నారు. మంచి భవిష్యత్తును డిమాండ్ చేయడమే మా ఏకైక నేరం, మమ్మల్ని అంత తేలికగా తొలగించలేరు కొత్త గృహం కోసం కృషి చేస్తున్నాం, బొద్దింకలు ఎప్పటికీ చనిపోవంటూ దిప్కే హెచ్చరించారు. ఈ పోస్ట్ తక్కువ సమయంలోనే వైరల్‌గా మారి, "కాక్‌రోచ్ జనతా పార్టీ" ప్రజాదరణను పెంచింది. యువత అసంతృప్తితో కూడిన ఈ మీమ్-ఆధారిత సంచలనంపై చర్చను మరింత ముమ్మరం చేసింది. తన ఇన్‌స్టాగ్రామ్, పార్టీ సోషల్ మీడియా పేజీలు హ్యాక్ అయ్యాయని దీప్కే ఆరోపించారు.












Click it and Unblock the Notifications