టెక్కీలకు షాక్: కాగ్నిజెంట్‌లో 4 వేల మంది ఉద్యోగులపై వేటు
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుండి ఈ క్వార్టర్‌కు 4 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు.
బెంగుళూరు: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్‌లో ఉద్యోగుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. మార్చి క్వార్టర్ నుండి ఈ క్వార్టర్‌కు 4 వేల మంది ఉద్యోగులు తగ్గిపోయారు. కంపెనీ రెండో క్వార్టర్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది కంపెనీ.
కాగ్నిజెంట్ కంపెనీలో 2,61,200 మంది ఉద్యోగులుంటే జూన్ క్వార్టర్‌కు వచ్చేసరికి రెండో క్వార్టర్ ఫలితాల్లో తెలిసింది.
టాప్ దేశీయ ఐటీ అవుట్‌సోర్స్ కంపెనీల్లో అత్యధికంగా కాగ్నిజెంట్ కంపెనీలోనే అత్యధికంగా ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినట్టుగా ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయి.

టీసీఎస్, ఇన్పోసిస్, టెక్ మహీంద్రా కంపెనీల్లో కూడ ఉద్యోగులు తగ్గిపోయారు. కానీ, ఈ మేర తగ్గింది. కాగా, విప్రో, హెచ్‌సిఎల్ టెక్నాలజీ కంపెనీలు మాత్రం తమ ఉద్యోగుల సంఖ్యను పెంచుకొన్నాయి. అయితే కాగ్నిజెంట్ తన రెవిన్యూ గైడెన్స్‌ను పెంచింది.
గతంలో తక్కువగా అంచనావేసిన 8-10 శాతం వృద్దిని 9 -10 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించింది. అంతేకాక మూడో క్వార్టర్‌లో వృద్దిరేటు 1.6-3 శాతముంటుందని కాగ్నిజెంట్ అంచనావేస్తోంది.
గురువారం ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ రెవిన్యూలు తొలి క్వార్టర్ కంటే 3.5 శాతం పెరిగి 3.67 బిలియన్ డాలర్లకు ఎగిశాయి. నికర లాభం కూడ ఈ క్వార్టర్‌లో 470 మిలియన్ డాలర్లుగా నమోదైంది.
గత ఏడాది ఇదే క్వార్టర్‌లో ఈ లాభం 252 మిలియన్ డాలర్లు మాత్రమే. క్వార్టర్లీ రెవిన్యూలు కూడ కంపెనీని 8.9 శాతం పెరిగినట్టు కాగ్నిజెంట్ తెలిపింది. రెండో క్వార్టర్‌లో బలమైన ఫలితాలను ప్రకటించామని కంపెనీ తెలిపింది. ఒక్కో షేరకు 0.80 డాలర్ల లాభం చేకూరుతోందని కంపెనీ పేర్కొంది.గత ఏడాది ఇది 0.41 డాలర్లుగా మాత్రమే ఉందని కాగ్నిజెంట్ తెలిపింది.
-
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రిలయన్స్ ఇండస్ట్రీస్ బంపర్ ఆఫర్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్ -
ఉప ప్రధానిగా చంద్రబాబు: వైఎస్ జగన్ రియాక్షన్












Click it and Unblock the Notifications