వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Col Santosh Babu: మహావీర చక్ర పురస్కారం: రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్న తల్లి, భార్య

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: తెలంగాణకు చెందిన ఆర్మీ అధికారి, దివంగత కల్నల్ సంతోష్ బాబుకు మరణానంతరం మహావీర చక్ర పురస్కారం లభించింది.
లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద భారత భూభాగంలోకి చొచ్చుకుని రావడానికి ప్రయత్నించిన చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ జవాన్లను నిలువరించే క్రమంలో వీరమరణం పొందారు. మాతృభూమిని కాపాడే ప్రయత్నంలో ఆయన చూపిన తెగువ, ధైర్య సాహసాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం మరణానంతరం కల్నల్ సంతోష్ బాబు పేరును మహావీర చక్ర పురస్కారం కోసం ఎంపిక చేసింది.

Recommended Video

#Watch : రాష్ట్రపతి చేతుల మీదుగా 'మహావీర చక్ర' పురస్కారాన్నిఅందుకున్న Col Santosh Babu తల్లి, భార్య!
రాష్ట్రపతి చేతుల మీదుగా..

రాష్ట్రపతి చేతుల మీదుగా..

కల్నల్ సంతోష్ బాబు తల్లి, భార్య ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఉదయం రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. వారికి ఈ అవార్డును అందజేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఇతర ఆర్మీ అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కల్నల్ సంతోష్‌బాబుతో పాటు పలువురికి వీరచక్ర పురస్కారాలను రాష్ట్రపతి అందజేశారు.

మిర్యాలగూడకు చెందిన సంతోష్ బాబు..

మిర్యాలగూడకు చెందిన సంతోష్ బాబు..

కల్నల్ సంతోష్ బాబు స్వస్థలం తెలంగాణలోని మిర్యాలగూడ. లఢక్ సమీపంలోని వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ వ్యాలీ వద్ద గత ఏడాది భారత ఆర్మీ-చైనాకు చెందిన పీఎల్ఏ సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణ సందర్భంగా ఆయన అమరుడయ్యారు. గాల్వన్ లోయ వద్ద భారత భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించిన చైనా సైనికులను జవాన్లు తిప్పి కొట్టారు. తమ ప్రాణాలను ఒడ్డి వారిని నిలువరించారు.

 చైనా తరఫునా ప్రాణనష్టం..

చైనా తరఫునా ప్రాణనష్టం..


ఈ సందర్భంగా చోటు చేసుకున్న ఘర్షణలో కల్నల్ సంతోష్ బాబు వీరమరణం పొందారు. ఆయనతో పాటు మరో 19 మంది జవాన్లు కన్నుమూశారు. చైనా తరఫున కూడా పెద్ద ఎత్తున ప్రాణనష్టం సంభవించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. 40 మందికి పైగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు మరణించినట్లు సమచారం వెలువడింది. దీన్ని చైనా నిర్ధారించలేదు. వారి సమాధులతో కూడిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడం చర్చనీయాంశమైంది.

ఉద్విగ్నంగా రాష్ట్రపతి భవన్..

కల్నల్ సంతోష్ బాబు చూపిన తెగువ, ధైర్యసాహసాలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయన పేరును మహావీర చక్ర పురస్కారం కోసం నామినేట్ చేసింది. తాజాగా- ఆయన భార్య, తల్లి ఈ పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకున్నారు. పురస్కారాన్ని అందజేయడానికి ముందు- కల్నల్ సంతోష్ బాబు పేరును పలికిన వెంటనే అక్కడ ఉద్విగ్న భరిత వాతావరణం ఏర్పడింది. కల్నల్ సంతోష్ బాబు ధైర్యసాహసాలను ప్రస్తావించారు. ఆ సమయంలో ఆయన తల్లి, భార్య ఉద్వేగానికి లోనయ్యారు.

వీరచక్ర పురస్కారాలు..

వీరచక్ర పురస్కారాలు..

కాగా- వైమానిక దళం చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ ఆర్ చౌధరి పరమ విశిష్ఠ సేవా మెడల్‌ను అందుకున్నారు. వీరచక్ర అవార్డును అందుకున్న వారిలో సిపాయి గుర్‌తేజ్ సింగ్, నాయక్ దీపక్ సింగ్, హవిల్దార్ కే పళని, నాయక్ సుబేదార్ నుదురామ్ సోరెన్, 4 పారా స్పెషల్ ఫోర్స్‌కు చెందిన సుబేదార్ సంజీవ్ కుమార్ ఉన్నారు. వారంతా గాల్వన్ వ్యాలీ ఘర్షణలో వీర మరణం పొందారు. వారి కుటుంబ సభ్యులు వీరచక్ర అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. హవిల్దార్ తేజిందర్ సింగ్ వీరచక్ర అవార్డును అందుకున్నారు. ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమం కొనసాగుతోంది.

English summary
Col Santosh Babu accorded Mahavir Chakra posthumously for resisting Chinese Army attack while establishing an observation post in the face of the enemy in Galwan valley. His mother and wife receive the award from President.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X