చలి గాలులతో ఉక్కిరిబిక్కిరి- మైనస్‌లో పడిపోయిన ఉష్ణోగ్రత
Cold Wave: ఉత్తరాది రాష్ట్రాలను చలి వెంటాడుతోంది. గజగజమంటూ వణికిస్తోంది. చలిగాలులు దాదాపుగా అన్ని రాష్ట్రాలను చుట్టుముట్టాయి. దట్టమైన పొగమంచు అలముకుంటోంది. దేశ రాజధాని సహా నేషనల్ కేపిటల్ రీజియన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో గడ్డకట్టించే వాతావరణం నెలకొంటోంది.
హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తోన్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మున్ముందు రాత్రి ఉష్ణోగ్రత మరింత క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు ముందుజాగ్రత్త చర్యలను తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

గత 24 గంటల వ్యవధిలో కనిష్ఠ ఉష్ణోగ్రత పంజాబ్‌లో నమోదైంది. ఇక్కడి ఆదంపూర్‌లో టెంపరేచర్ మైనస్‌లో పడిపోయింది. -0.4గా రికార్డయింది. హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులకు సమీపంలో ఉండే గ్రామం ఇది. దీని తరువాత హర్యానా హిసార్‌లో అత్యల్పంగా 1.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హిమాలయ పర్వత శ్రేణుల మీదుగా వీస్తోన్న చలిగాలులు, అక్కడ కురుస్తోన్న మంచు వర్షం వల్ల చలిగాలుల తీవ్రత ఇక్కడ ఒక్కసారిగా పెరిగింది.
రాజస్థాన్‌లోని చురు- 3.1, పంజాబ్ అమృత్‌సర్- 3.8, రాజస్థాన్ పిలానీ- 4.0, ఉత్తరప్రదేశ్ సర్సవా- 4.1, పంజాబ్ హల్వారా ఐఎఎఫ్- 4.1, రాజస్థాన్ ఉత్తర్‌లై ఐఎఎఫ్- 4.2, హర్యానా భివానీ- 4.6 డిగ్రీల సెల్సియస్ మేర కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యప్రదేశ్ రాజ్‌గఢ్- 4.6, రాజస్థాన్ చిత్తోర్‌గఢ్- 4.7, మధ్యప్రదేశ్ ఉమేరియా- 4.8, ఉత్తరప్రదేశ్ బరేలీ- 4.9 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రత రికార్డయినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.
Minimum Temperature (< 5° C) over the plains of the country (13-12-2024)#imd #weatherupdate #india #temperature #coldwave #Haryana #Rajasthan #UttarPradesh #MadhyaPradesh @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts@DIPRRajasthan @IMD_Chandigarh @mpsdma@UP_SDMA pic.twitter.com/9zVnncgKQX
— India Meteorological Department (@Indiametdept) December 13, 2024
పొగమంచు దట్టంగా అలముకోవడం వల్ల ఎదురుగా ఏముందు తెలియని పరిస్థితి నెలకొంది. చలి తీవ్రత ప్రభావం రోజువారీ కార్యకలాపాలపై తీవ్రంగా పడింది. జనం బయటికి రావడానికి జంకుతున్నారు. వయోధిక వృద్ధులు శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొన వచ్చని డాక్టర్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications