ప్రోఫెసర్ చెయ్యి నరికివేత: పది మందికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష
కొచ్చి: కేరళ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ప్రోఫెసర్ చెయ్యి నరికివేత కేసులో నిందితులకు జైలు శిక్ష పడింది. కొందరు నిర్దోషులుగా విడుదల అయ్యారు. 10 మందికి కఠిన కారాగార శిక్ష పడింది, ముగ్గరు తక్కువ శిక్షతో తప్పించుకున్నారు.
కేరళలోని ఎర్నాకులంకు చెందిన ప్రొఫెసర్ టి.జే. జోసెఫ్ మీద 2010 జులై 4వ తేదిన పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా కార్యాకర్తలు దాడి చేసి ఆయన రెండు చేతులు నరికి వేశారు. ఆ ఘటనలో ప్రొఫెసర్ కుడి చెయ్యిని పూర్తిగా కోల్పోవలసి వచ్చింది.

కాలేజ్ ఇంటర్నల్ పరిక్షలలో ప్రొఫెసర్ తక్కువ మార్కులు వేశారని జోసెఫ్ మీద దాడి జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు 31 మందిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. అప్పటి నుండి కేసు విచారణ జరుగుతున్నది. తక్కువ మార్కులు వేసిన గురువు చేతిని నరికి వెయ్యడంతో ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.
కేసు విచారణ చేసిన న్యాయస్థానం 13 మంది నిందితులను గుర్తించింది. శుక్రవారం కేసు తీర్పు వెల్లడించింది. 10 మందికి 8 సంవత్సరాల కఠినకారాగార శిక్ష, ముగ్గురికి రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించింది. మిగిలిన వారిని నిర్దోషులుగా విడుదల చేసింది.
గతంలో తన మీద దాడి చేసిన వారిని తాను క్షమిస్తున్నానని ప్రోఫెసర్ జోసెఫ్ చెప్పారు. ప్రోఫెసర్ జోసెఫ్ కు అయ్యే వైద్య ఖర్చులు భరించాలని, ఆయన ఆర్థిక ఇబ్బందులు మొత్తం తీర్చాలని కేరళ ముఖ్యమంత్రి ఉమెన్ చాంద్ ఆదేశాలు జారీ చేశారు. జోసెఫ్ కు రూ. 8 లక్షలు పరిహారం అందించారు.












Click it and Unblock the Notifications