Online trading: రూ. లక్షల్లో నష్టపోయిన కాలేజ్ స్టూడెంట్, , క్లైమాక్స్ లో ఏం చేశాడంటే ?
చెన్నై/కోయంబత్తూరు: వృద్ధురాలిని గొంతు కోసి హత్య చేసిన కేసు ఊహించని మలుపు తిరిగింది. ఈ హత్య కేసులో కాలేజ్ విద్యార్థి అరెస్లు కావడంతో కొత్త ట్విస్ట్ బయటపడింది. ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో చేసిన అప్పులే కాలేజ్ విద్యార్థిని హత్యకు పురికొల్పిందని పోలీసులు అన్నారు. వృద్ధురాలిని హత్య చేసి 14 తులాల బంగారు నగలు దోచుకోవాలని పథకం వేసిన కాలేజీ విద్యార్థి హత్యను కప్పిపుచ్చేందుకు ప్రయత్నించి చివరికి చిక్కిపోయాడని పోలీసులు అన్నారు. మంచి ఉద్యోగం చెయ్యాల్సిన యువకుడికి ఇప్పుడు రోజు జైల్లో కాలం గడపాల్సి వచ్చింది.

దారుణ హత్య
63 ఏళ్ల మురుగన్ అనే మహిళ తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలోని మెట్టుపాళయం సమీపంలోని జడయంపాళయం గ్రామంలో నివాసం ఉంటున్నారు. మురుగన్ భార్య సరోజిని రైతు. మురుగన్ దంపతుల ఊరిబయట ఉన్న తోటలో ఉంది. ఈనెల 21వ తేదీ సాయంత్రం కుమారుడు సురేష్ కుమార్ ఇంటికి వెళ్లి చూడగా సరోజిని గొంతుకోసి దారుణంగా హత్య చేసిన విషయం వెలుగు చూసింది.

రంగంలోకి దిగిన పోలీసులు
సరోజి నగలు కూడా చోరీకి గురైనట్లు వెల్లడైంది. సమాచారం అందుకున్న సిరుముగై పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గుర్తుతెలియని దుండగుడు ఇంట్లోకి ప్రవేశించి సరోజిని హత్య చేసి నగలు చోరీ చేశారని పోలీసులు అనుమానించారు. కోయంబత్తూరు జిల్లా ఎస్.పి 5 ప్రత్యేక బలగాలు ఏర్పాటు దర్యాప్తు చేశారు. మెట్టుపాళయం సౌత్ రోడ్ లో పోలీసులు వాహనాల తనిఖీ చేశారు.

కాలేజ్ విద్యార్థి నాటకాలు
ఆరోజు బైక్ లో వెళ్లిన వసంత్ అనే యువకుడిని పోలీసులు పట్టుకుని విచారించారు. విచారణలో వసంత్ చేతులకు కొన్ని గాయాలు ఉన్నాయని పోలీసులు గుర్తించారు. గాయాలపై పోలీసులు ప్రశ్నించగా కాలేజీ గ్రౌండ్‌లో ఆడుకుంటుండగా అద్దం తగిలి గాయమైందని వసంత్ పోలీసులకు చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు కళాశాల మైదానానికి వెళ్లి తోటి విద్యార్థులను విచారించాగా వసంత్ అపద్దాలు చెప్పాడని తేలిపోయింది.

కాలేజ్ స్టూడెంట్ ఇంట్లో బంగారు నగలు
పోలీసులు కాలేజ్ విద్యార్థి వసంత్ ను వెండ్ తీశారు. వృద్ధురాలు సరోజిని తనే హత్య చేసి నగలు దోచుకెళ్లినట్లు వసంత్ అంగీకరించాడు. .ఆ సమయంలో సరోజిని ప్రతిఘటించడతో తన చేతికి గాయాలు అయినట్లు వసంత్ పోలీసుల విచారణలో అంగీకరించాడు. వసంత్ ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు అతడి ఇంటికి వెళ్లి దాచి పెట్టిన 14 తులాల ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు

ఆన్ లైన్ ట్రేడింగ్ లో రూ. లక్షల్లో నష్టం
కొన్ని నెలలుగా ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు పాల్పడుతున్న వసంత్ కుమార్ అలియాస్ వసంత్ కు కొన్ని లక్షల రూపాయల నష్టం వాటిల్లింది. పోగొట్టుకున్న డబ్బును సంసాధించడానికి, చేసిన అప్పుల బాధ నుంచి తప్పించుకునేందుకే సరోజిని హత్య చేసి బంగారు నగలు లూటీ చేశానని వసంత్ అంగీకరించాడని పోలీసు అధికారులు తెలిపారు. పోలీసులు వసంత్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు.












Click it and Unblock the Notifications