దొంగలుగా మారిన ఎంబీఏ విద్యార్థి, బీఏ విద్యార్థిని! యూట్యూబ్‌లో‌లో దొంగతనం పాఠాలు

విలాసాలకు అలవాటు పడిన ఓ యువకుడు, మరియు యువతిలు దోంగలుగా మారారు. అదికూడ ప్రోఫెషనల్ కోర్సులు చేస్తూ... డబ్బుల కోసం నెలకు రెండు లేదా మూడు దోంగతనాలు చేస్తూ చివరకు కటకటాల పాలయ్యారు. అయితే ట్విస్ట్ ఏంటంటే , ఇళ్ల తలుపులు, తాళాలు పగులగోట్టడడం పాటు, తాము ఎలా దోంగతనం చేయాలో తెలుసుకునేందుకు యూ ట్యూబ్ ద్వార నేర్చుకున్నారు. యూ ట్యూబ్ పాఠాలను ప్రాక్టికల్‌గా అమలు పరస్తూ ప్రోఫెషనల్ దోంగలుగా మారారు.

దోంగలుగా మారిన ఏంబీఏ ,బీఏ విద్యార్థులు

దోంగలుగా మారిన ఏంబీఏ ,బీఏ విద్యార్థులు

మహరాష్ట్రాలోని నాగ్‌పూర్ జిల్లాలోని హజిపహాడ్ ప్రాంతానికి చెందిన 29 ఏళ్ల శైలేశ్ వసంత్ డూమ్రె మరియు అమ్రవతి జిల్లాకు చెందిన 21 సంవత్సరాల మరోయువతి గౌరీ గోర్మేడాలు ఇద్దరు కలిసి ఈ దోంగతనాలకు పాల్పడ్డారు. కాగా శైలేష్ ఏంబీఏ చదువుతుండగా గౌరీ ఫైర్ ఆర్ట్స్ కొనసాగిస్తుంది. కాగా వీరిద్దరికి పరిచయం ఏర్పడి గత రెండు సంవత్సరాల క్రితం స్నేహితులుగా మారారు. అనంతరం ఇద్దరు కలిసి డేటింగ్‌లకు వెళ్లారు. అనంతరం లవర్స్‌గా మారారు. దీంతో నాగ్‌పూర్‌లోని ఓ అద్దె ఇంట్లో కలిసి ఉంటున్నారు.

దోంగతనం కోసం యూ ట్యూబ్ పాఠాలు

దోంగతనం కోసం యూ ట్యూబ్ పాఠాలు

అయితే ఇద్దరు విద్యార్థులు కావడంతో వారికి కావాల్సిన అవసరాల కోసం దోంగతనాలకు పాల్పడ్డారు. ఇందుకోసం యూట్యూబ్‌లో దోంగతనాలు ఎలా చేయాలో నేర్చుకున్నారు. దొంగతనాలు చేసేందుకు గ్యాస్‌కట్టర్ కొన్నారు. దాంతో తాళాలు, ఐరన్ రాడ్స్ ఎలా కట్ చేయాలో తము కిరాయికి ఉంటున్న ఇంట్లోనే ప్రాక్టీస్ చేశారు. తళాలు కట్ చేయడం పర్‌ఫెక్ట్ అయిన తర్వాత దోంగతనాలకు ప్రిపేర్ అయ్యారు. అనంతరం ఏకంగా ఏటీఎమ్‌కు గురిపెట్టి వాటిని తోలగించేందుకు తీసుకోవాల్సిన చర్యలను కూడ యూ ట్యూబ్‌లో చూసి నేర్చుకున్నారు.

మొదటి దోంగతనంలోనే రెండున్నర లక్షలు

మొదటి దోంగతనంలోనే రెండున్నర లక్షలు

దీంతో మొదటిసారిగా గత ఎప్రిల్‌లో మంకాపూర్ అనే ప్రాంతంలో రెండున్నర లక్షల రూపాయల విలువ చేసే బంగారు అభరణాలు ఇతర వస్తువులను మొదటిసారి ఎత్తుకెళ్లారు. దీంతో వారి అవసరాలు తీర్చుకుంటూ ఎంజాయ్ చేయడం ప్రారంభించారు. దోంగతనం చేసిన డబ్బులతో ఓ కారును కూడ కొనుగోలు చేశారు. ఇలా తమ అవసరాల కోసం నెలకు రెండు లేదా మూడు ఇళ్లలో చోరీలు చేయడం టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇక దోంగతనాలు చేసిన తర్వాత ప్రస్తుతం ఉన్న ఇంటిని మార్చి మరో ఇంటికి చేరుకునేవారు.

కారుతో బయటపడ్డ దోంగతనం

కారుతో బయటపడ్డ దోంగతనం

అయితే ఇలా ఓకే విధానంతో గ్యాస్ కట్టర్‌లతో తాళాలు కట్ చేసి దోంగతనాలు చేయడంతో పోలీసులు నిఘా పెంచారు. ఇలా ఓ ఇంట్లో దోంగతనం చేసిన తర్వాత స్థానికంగా ఉన్న సీసీ ఫుటేజీని పోలీసులు పరీశీంచడంతో అందులో ఓ కారు అనుమానస్పదంగా తిరగడంపై పోలీసులు నిఘా పెట్టారు. ఆ కారుకు సంబంధించి వారు ఏం చేస్తున్నారో తెలుసుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ నేపథ్యంలోనే దోంగతనాలు చేసిన డబ్బుతో ఒక్క రాత్రి వేల రూపాయాలు ఖర్చు పెట్టడడం పోలీసులు గమనించారు. వెంటనే ఇంటిపై రైడ్ చేసి ఇంట్లో ఉన్న గ్యాస్ కట్టర్ ఇతర సామాగ్రీని గుర్తించారు. వారితో పాటు కారును సైతం స్వాధీనం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+