ప్రేమ జంట: అమ్మాయి కావాలని దాడి

కుంభకోణం: ప్రేమ జంటపై దాడి చేసి, అమ్మాయిని ఎత్తుకు వెళ్లడానికి విఫలయత్నం చేసి చివరికి నగదు, సెల్ ఫోన్, ఏటీఎం కార్డులు లాక్కోని పరారైన కాలేజ్ విద్యార్థులను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. తమిళనాడులోని తంజావూర్ జిల్లా కుంభకోణం సమీపంలోని కల్లూరులో అయ్యప్పన్ (21) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు.

ఇతను ప్రయివేటు కంపెనీ ఇన్సూరెన్స్ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతను తమ సంస్థలో పని చేస్తున్న యువతితో కలిసి శుక్రవారం రాత్రి స్వామి మలై దేవాలయానికి వెళ్లాడు. పూజ చేసుకుని తిరిగి కుంభకోణం చేరుకున్నారు.

యువతిని బస్సు ఎక్కించడానికి అంజూర్ బైపాస్ రోడ్డులో వేచి ఉన్నాడు. ఆ సందర్బలో పీకలదాక మద్యం సేవించిన ఐదుగురు అక్కడికి వచ్చిఇద్దరి మీద దాడి చేశారు, యువతితో చెప్పుకోలేని విధంగా అసభ్యంగా ప్రవర్తించారు. ఆమెను ఎత్తుకు వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కారు అటు రావడంతో ఐదుగురు పక్కకు వెళ్లిపోయారు.

College Students arrested in Kumbakonam in tamil Nadu

అదే సమయంలో బస్సు రావడంతో యువతిని బస్సు ఎక్కించాడు. తరువాత బైక్ తీసుకుంటున్న అయ్యప్పన్ మీద నిందితులు మళ్లి దాడి చేశారు. యువతిని పిలుచుకుని రావాలని అతనిని వేధించారు. చివరికి అతని దగ్గర ఉన్న మొబైల్, నగదు, ఏటీఎం కార్డులు లాక్కుని అక్కడి నుండి పరారైనారు.

అయ్యప్పన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి కుంభకోణంలోని కొట్టయూరుకు చెందిన అరుణ్ కుమార్ (21), కరుప్పన్ (22), విఘ్నేష్ (21), ఆనంద్ (24), రాంకీ (24) అనే ఐదు మంది కాలేజ్ విద్యార్థులను అరెస్టు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+