రైల్వే స్టేషన్లో కలకలం: కత్తులతో దాడులు చేసుకున్న విద్యార్థులు
చెన్నై: తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా పట్రవాక్కం రైల్వే స్టేషన్‌లో రెండు గ్రూపులకు చెందిన విద్యార్థులు తీవ్ర కలకలం రేపారు. మారణాయుధాలతో ఇరు వర్గాలు దాడి చేసుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే ఈ ఘటన చోటు చేసుకుంది.
చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరిన లోకల్ ట్రైన్ పట్టరైవాకం స్టేషన్‌కు చేరుకోగానే అందులో నుంచి దిగిన రెండు గ్రూపుల విద్యార్ధులు కత్తులతో ఒకరిపై మరొకరు దాడులకు దిగారు. కొందరు విద్యార్థులు కత్తులు ప్రదర్శిస్తూ.. మరో వర్గం విద్యార్థులను వెంబడించి మరీ దాడులు చేశారు.

ఈ ఘటనతో అదే రైల్లో ఉన్న ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. ప్రాణభయంతో పరుగులు తీశారు. విద్యార్ధుల పరస్పర దాడులతో రైల్వేస్టేషన్ దద్దరిల్లింది. ఈ దాడుల అనంతరం విద్యార్ధులు అదే రైల్లో వెళ్లిపోవడం గమనార్హం.
ఈ ఘటనపై స్టేషన్ మేనేజర్ ఇచ్చిన సమాచారం మేరకు రైల్వే పోలీసులు విచారణ చేపట్టారు. దాడులు చేసుకున్న విద్యార్థులను గుర్తించేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. ఘటనా స్థలంలో ఉన్నవారు తమ సెల్‌ఫోన్ల ద్వారా రికార్డు చేసిన వీడియోలను తీసుకుని.. దర్యాప్తు జరుపుతున్నారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications