యూపీలో ప్రచారానికి శ్రీకారం.!అక్కడ ప్రభావం చూపించగలిగితే పూర్వవైభవం ఖాయమన్న ప్రియాంక.!
లక్నో/హైదరాబాద్ : ఉత్తర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ తాడోపేడో తేల్చుకునేందుకు రెఢీ అయినట్టు తెలుస్తోంది. ఈ సారి అధికారం చేపట్టే దిశగా పక్కా స్కెచ్ తో అడుగులేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ, ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ప్రియాంకా గాంధీ నేతృత్వంలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు కాంగ్రెస్ నేతలు. యోగి ప్రభుత్వంలోని వైఫల్యాలను అస్త్రాలుగా మలుచుకుని ప్రజల్లోకి వెళ్తే అనుకూల వాతావరణం ఉంటుందని ప్రియాంక పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసారు. అంతే కాకుండా బుందేల్ ఖండ్‌పై ప్రభావం చూపించగలిగితే కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తప్పదని ప్రియాంక స్పష్టం చేస్తున్నరు.

యూపీలో ప్రియాంక ప్రచారం.. యోగీ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం
ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పూర్వ వైభవం తెచ్చిపెట్టాలన్న లక్ష్యంతో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకా గాంధీ ప్రత్యేక వ్యూహాంతో ముందుకెళ్తున్నారు. కాంగ్రెస్‌కు అవకాశం ఉన్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. బుందేల్ ఖండ్ ప్రాంతంలో కొన్నాళ్ల వరకూ కాంగ్రెస్‌కు తిరుగులేకుండా ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఈ సారి ప్రియాంకా గాంధీ ఆ ప్రాంతంపై ప్రత్యే దృష్టి పెట్టారు. మోహబాలో రోడ్ షో ద్వారా రంగంలోకి దిగుతున్నారు ప్రియాంక. ఇటీవలి కాలంలో యూపీలో కాంగ్రెస్ పార్టీ తరుపునుండి అన్నీ తానై ప్రియాంక గాంధీ అడుగులేస్తున్నారు. నేను అమ్మాయిని, నేనూ పోరాడతాను అనే నినాదంతో ఎన్నికల ప్రయారాన్ని ప్రారంభించారు ప్రియాంక గాంధీ.

బుందెల్ ఖండ్ పై ప్రత్యేక దృష్టి.. అక్కడ ప్రభావం చూపిస్తే తిరుగుండదంటున్న ప్రియాంక
యూపీలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ జవసత్వాలు తీసుకొచ్చేందుకు ప్రియాంకా గాంధీ విస్తృతంగా ప్రయత్నిస్తున్నారు. 1989లో కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయిన నాటి నుంచి ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ బలహీన పడుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‌ను అన్ని పార్టీలూ పంచుకున్నాయి. ఇప్పుడు మళ్లీ అందర్నీ పార్టీ వైపు తీసుకు వచ్చేందుకు ప్రియాంకా ప్రయత్నిస్తున్నారు. కుల, మతాలకు భిన్నంగా ఈసారి మహిళా మంత్రం ప్రయోగిస్తున్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం పార్టీ టికెట్లు మహిళలకే కేటాయించాలని నిర్ణయించారు ప్రియాంక నిర్ణయించారు.

మహిళలకు పెద్ద పీఠ.. చరిత్రను తిరగరాస్తామంటున్న కాంగ్రెస్ నేతలు
వచ్చే సంవత్సరంలో జరగబోయే ఎన్నికలో 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ తరఫు నుంచి 161 మంది మహిళా అభ్యర్థులు బరిలో నిలువబోతున్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం 11 మంది మహిళా అభ్యర్థులను మాత్రమే పోటీలో ఉంచగా, అందులో ఇద్దరే గెలిచారు. ఇప్పటి వరకు కులం, మతం ఆధిపత్యం చెలాయిస్తున్న యూపీ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ ప్రణాళికలతో ప్రియాంకాగాంధీ ముందుకు వచ్చారు. 2019లో లోక్‌సభ ఎన్నికల్లో ప్రియాంక బాధ్యతలు తీసుకున్నప్పటికీ చివరి క్షణంలో రావడం వల్ల ఎలాంటి ప్రయోజనం లభించలేదు. మళ్లీ పొరపాటు జరగకుండా ఇప్పుడు మాత్రం ముందుగానే రంగంలోకి దిగారు ప్రియాంక.

యూపీని చుట్టేసిన ప్రియాంక.. బుందేల్ ఖండ్ లో గెలిస్తే అదికారం తప్పదంటున్న ప్రియాంక..
మహిళలకు నలభై శాతం టిక్కెట్లతో పాటు ఉచితంగా స్మార్ట్‌ఫోన్లు, ఈ-స్కూటర్లు వ్యవసాయ రుణాలు పూర్తిగా రద్దు చేయడం, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు , రైతులకు మద్దతు ధరలు ఇలా ఎనిమిది అంశాలను మాత్రమే తీసుకుని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు ప్రియాంక. బుందేల్ ఖండ్ వంటి ప్రాంతాలపై బీజేపీ కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఇప్పుడు అక్కడ ప్రియాంకా గాంధీ ప్రచారం చేయడానికి రంగం సిద్దం చేసుకున్నారు. రెండేళ్ల నుంచి ఉత్తరప్రదేశ్ అంతటా పర్యటించిన ప్రియాంక గాంధీ యూపీ రాష్ట్రం మీద మంచి పట్టు సాధించారు. ప్రియాంక వ్యూహాలు ఫలిస్తే కాంగ్రెస్‌కు మళ్లీ పూర్వ వైభవం వస్తుందన్న అభిప్రాయాలు యూపి వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications