గుడ్‌న్యూస్: ఎల్పీజీ సిలిండర్ల ధర తగ్గింపు: కొత్త రేట్లివే
న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాల కోసం వినియోగించే వంటగ్యాస్ సిలిండర్ రేటు తగ్గింది. ఒక్కో గ్యాస్ కనెక్షన్‌పై రూ.171.50 పైసల మేర తగ్గించాయి చమురు కంపెనీలు. ఈ తెల్లవారు జాము నుంచి ఈ రేట్లు అమల్లోకి వచ్చాయి. వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల బరువు ఉండే వంటగ్యాస్ సిలిండర్లకు ఈ తగ్గింపు వర్తిస్తుందని ఆయిల్ కంపెనీలు వెల్లడించాయి.
గృహావసరాల కోసం వినియోగించే గ్యాస్ కనెక్షన్ల రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. ఇందులో మార్పులేమీ చేయలేదు. వాటి రేట్లను తగ్గించలేదు. కేంద్ర ప్రభుత్వం ఇదివరకు వరుసగా పలుమార్లు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రేట్లను పెంచిన విషయం తెలిసిందే. 2021 నుంచి తరచూ సిలిండర్ రేటును పెంచుతూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం.

అదే ఏడాది నవంబర్, డిసెంబర్‌లో ఈ కేటగిరీకి చెందిన వంటగ్యాస్ సిలిండర్లపై మోపిన భారం రూ. 369.50 పైసలు. నవంబర్‌లో 266 రూపాయలు, డిసెంబర్‌లో రూ.103.50 పైసలను పెంచింది. ఫలితంగా దేశవ్యాప్తంగా కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ల ధరలు ఆకాశాన్నంటాయి. 2,000 రూపాయలను ఎప్పుడో దాటేశాయి. 2022లో మార్చి 1వ తేదీన 105 రూపాయలు, ఏప్రిల్ 1వ తేదీన ఏకంగా 250 రూపాయలు పెరిగింది.
గత ఏడాది మే 1వ తేదీన కూడా 100 రూపాయల భారాన్ని అధికంగా మోపింది. ఫలితంగా- పలు నగరాల్లో వాణిజ్య సిలిండర్ల ధర 2,400 రూపాయలను దాటేసింది. ఈ పెంపు పట్ల దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. హోటళ్ల మనుగడ తలకిందులైంది. కమర్షియల్ వంటగ్యాస్‌ను వినియోగించే చిరు వ్యాపారులు ఇప్పటికే అనేక ఇక్కట్ల బారిన పడ్డారు.
దీనికి తోడు హోటళ్లల్లో వినియోగించే సిలిండర్ల ధర పెరగడం వల్ల వ్యాపార కార్యకలాపాలు మరింత దెబ్బతిన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని కిందటి సంవత్సరం కమర్షియల్ ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ల రేట్లను రెండుసార్లు తగ్గించింది. ఒకసారి 135 రూపాయల, మరోసారి 36 రూపాయలను తగ్గించింది. 2023 జనవరి 1వ తేదీన మళ్లీ వాటి రేట్లను పెంచింది.
తాజాగా కమర్షియల్ వంటగ్యాస్ వినియోగదారులకు ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. వాటి రేటును సవరించింది. ఒక్కో సిలిండర్‌పై రూ.171.50 పైసల మేర తగ్గించింది. దీనితో దేశ రాజధానిలో ఒక్కో వాణిజ్య సిలిండర్ రేటు రూ.1,856.50 పైసలకు చేరింది. ముంబైలో రూ.1,808.50 పైసలు పలుకుతోంది. కోల్‌కతలో రూ.1,960.50 పైసలుగా రికార్డయింది. చెన్నైలో రూ.2,021 రూపాయలుగా నమోదైంది.
-
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..!












Click it and Unblock the Notifications