జైల్లో ఉన్నారు.. అభ్యర్థులకు టికెట్లిచ్చారు..! లాలూపై జేడీయూ ఫైట్
ఢిల్లీ : ఆర్‌జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పై పోరాటానికి సిద్ధమయ్యారు బీహార్ జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్. జైల్లో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆయన పార్టీ అభ్యర్థులకు టికెట్లు ఎలా ఇచ్చారనేది నీరజ్ కుమార్ డౌట్. ఆ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పూర్తిస్థాయిలో విచారించి తగు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఆర్‌జేడీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన అభ్యర్థులను డిక్లేర్ చేసిన పత్రంపై లాలూ ప్రసాద్ సంతకం చేయడం దుమారం రేపింది. దానిపై జేడీయూ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ఈసీని ఆశ్రయించిన నీరజ్ కుమార్ తన ఫిర్యాదులో పలు అనుమానాలు లెవనెత్తారు.

లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో ఉండటంతో అభ్యర్థులను ప్రకటించే విషయంలో.. ఆయన ఈసీ నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకున్నారా అంటూ ప్రశ్నించారు. ఒకవేళ ఎన్నికల సంఘం ఎలాంటి పర్మిషన్ ఇవ్వనిపక్షంలో ఆయనపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జైల్లో ఉన్న వ్యక్తి అసలు అభ్యర్థులను ఎలా ప్రకటించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. లాలూ జైల్లో ఉన్నప్పటికీ.. ఆయన ట్విట్టర్ అకౌంట్ యాక్టివ్ గా ఉండటానికి కారణాలేంటి, అసలు అది ఎవరు వాడుతున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications