బెంగాల్‌లో పరిస్థితి చేయిదాటిపోయింది : రాష్ట్రపతి పాలన విధించాలని అమిత్ షాకు ముకుల్ లేఖ ?

కోల్‌కత : పశ్చిమబెంగాల్‌లో ప్రజాస్వామ్యం అపహస్యానికి గురవుతుందన్నారు బీజేపీ నేత ముకుల్‌రాయ్. రాజ్యాంగ వ్యవస్థలను సీఎం మమతా బెనర్జీ నీరుగార్చారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడిందని .. వెంటనే కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. వెంటనే జోక్యం చేసుకొని .. రాష్ట్రపతి పాలన దిశగా చర్యలు తీసుకోవాలని విన్నవించారు. లేదంటే రాష్ట్రంలో పరిస్థితి చేయిదాటిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

చర్యలు తీసుకొండి ..
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను హోంమంత్రి అమిత్ షాకు లేఖలో వివరించారు ముకుల్ రాయ్. బెంగాల్‌లో అరాచకం రాజ్యమేలుతుందని అందులో పేర్కొన్నారు. వెంటనే రాష్ట్రపతి పాలన దిశగా హోంశాఖ చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీ, టీఎంసీ కార్యకర్తల మధ్య జరుగుతున్న దాడులను అరికట్టడంలో రాష్ట్ర పోలీసు యంత్రాంగం పూర్తిగా విఫలమైందని గుర్తుచేశారు. దీంతో రాష్ట్రంలో అంశాంతి నెలకొందని పేర్కొన్నారు. బెంగాల్‌లో ఈ పరిస్థితికి కారణం టీఎంసీని అని లేఖలో ఆరోపించారు.

Complete anarchy in Bengal: BJP leader Mukul Roy writes to Amit Shah, asks MHA to step in

మమత ప్రోద్బలంతోనే ...
బెంగాల్‌లో సీఎం మమతా బెనర్జీ ప్రోద్బలంతోనే టీఎంసీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన దాడులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా మమతా బెనర్జీ కారణమని ఆరోపించారు. ఆమె అండదండలతోనే టీఎంసీ కార్యకర్తలు పెట్రేగిపోయారని గుర్తుచేశారు. పరిస్థితి రాష్ట్ర యంత్రాంగం చేయిదాటిపోయిందని .. వెంటనే కేంద్రం జోక్యం చేసుకోవాలని సూచించారు. ఇటీవల జరిగిన ఘర్షణలో 10 మంది కార్యకర్తలు చనిపోతే .. 8 మంది టీఎంసీకి చెందినవారని మమత పేర్కొన్న సంగతి తెలిసిందే. ఎన్నికల తర్వాత కూచ్ బెహర్, ఉత్తర 24 పరగణ, హౌరా, పశ్చిమ బుర్దాన్‌లో కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. దీంతో కొందరు కార్యకర్తలు చనిపోగా .. పదుల సంఖ్యలో గాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+