వెంటనే బలనిరూపణకు ఆదేశాలు ఇవ్వండి: సుప్రీంకోర్టులో కపిల్ సిబాల్ వాదనలు

మహారాష్ట్రలో మెజార్టీ ప్రభుత్వ లేకున్నా గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించారని శివసేన తరపు లాయర్ కపిల్ సిబాల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు అక్టోబర్ 24న పూర్తయ్యాయని సిబల్ వాదించారు. శివసేన-బీజేపీ పొత్తు పొడవకపోవడంతో.. శివసేన కూటమి తెరపైకి వచ్చిందన్నారు. కానీ తగిన సమయం ఇవ్వకుండానే రాష్ట్రపతి పాలన విధించారని తెలిపారు.

నవంబర్ 23 తెల్లవారజామున దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని గుర్తుచేశారు. మెజార్టీ లేకుండానే ప్రభుత్వాన్ని గవర్నర్ భగత్ సింగ్ కొషియారి ఆహ్వానించారని తెలిపారు. అలాగే శనివారం ఉదయం 5 గంటలకు రాష్ట్రపతి పాలన తొలగించారని పేర్కొన్నారు. గవర్నర్ ఎవరి ఆదేశాలతో పనిచేస్తున్నారని ప్రశ్నించారు. అసెంబ్లీలో వెంటనే బలనిరూపణకు ఆదేశాలు జారీచేయాలని కోరారు.

ఇవాళ ఆదివారం సుప్రీంకోర్టుకు సెలవు. కానీ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సీరియస్‌నెస్ దృష్ట్యా నేపథ్యంలో పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది.

conduct floor test kapil sibal asks supreme court

సీనియర్ లాయర్లు అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబాల్ శివసేన, ఎన్సీపీ తరపున తమ వాదనలను వినిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సీనియర్ అడ్వకేట్ దేవదత్త్ కామట్ వాదనలు కొనసాగించారు. మహారాష్ట్ర గవర్నర్ తరఫున అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ తమ వాదనలను ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి బీజేపీ తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తురు.

ఆదివారం ధర్మసనాన్ని ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని కపిల్ సిబాల్ ధర్మసనాన్ని కోరారు. దానికి ప్రతీగా సుప్రీంకోర్టు జస్టిస్ ఎన్వీ రమణ ఫరవాలేదు అని పేర్కొన్నారు. తమ విధి రాజ్యాంగాన్ని సంరక్షించడమే అని తెలిపారు. ఎన్నికలకు ముందు ఏర్పడిన కూటమి మధ్య సయోధ్య కుదరలేదని గుర్తుచేశారు. రాష్ట్రపతి పాలనను కూడా కేంద్ర మంత్రివర్గ సమావేశం లేకుండానే తొలగించారని తెలిపారు.

ఇది దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి అని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. శివసేన కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు 22న నిర్ణయం తీసుకుందని తెలిపారు. కానీ ఆ మరునాడే బీజేపీ అప్రజాస్వామ్య రీతిలో అధికారం చేపట్టిందని వివరించారు. దీనికి ప్రతీగా రాష్ట్రపతి పాలనకు మంత్రివర్గ సమావేశం సమస్య కాదని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. కానీ మెజార్టీ లేకుండా ప్రభుత్వం ఎలా ఏర్నడిందని జస్టిస్ భూషణ్ ప్రశ్నించారు. అదీ మాకు కూడా తెలియదని సిబాల్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+