వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జేఎన్‌యూలో జాతి వ్యతిరేక నినాదాలు వాస్తవమే!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాయలంలో జాతి వ్యతిరేక నినాదాలు వినిపించిన మాట వాస్తవమేనని తేలింది. ఫిబ్రవరి 9న ఢిల్లీలోని సదరు వర్సిటీలో ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతకు వ్యతిరేకంగా ర్యాలీ జరిగింది.

ఈ ర్యాలీలో అఫ్జల్ గురు ఉరితీతకు సంబంధించి విద్యార్థుల మధ్య ఘర్షణ తలెత్తింది. అఫ్జల్ ఉరిని 'జ్యూడీషియల్ కిల్లింగ్'గా అభివర్ణించిన ఓ వర్గం విద్యార్థులు దేశానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

ఈ మేరకు గుజరాత్ రాజధాని గాంధీనగర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీ (సీఎఫ్ఎస్ఎల్) తనకు అందిన వీడియోలను పరిశీలించి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. సదరు ర్యాలీలో వినిపించిన దేశ వ్యతిరేక నినాదాలు ఇలా ఉన్నాయి.

Confirmed! Anti-national slogans were raised during pro-Afzal Guru event at JNU on February 9

- తుమ్ కిత్నే అఫ్జల్ మారోంగే, ఘర్ ఘర్ సే అఫ్జల్ నికలేంగే
- పాకిస్థాన్ జిందాబాద్
- కాశ్మీర్ మాంగే ఆజాదీ, లడ్కర్ లేంగే ఆజాదీ
- కాశ్మీర్ కి ఆజాదీ తక్, జంగ్ రహేగీ- జంగ్ రహేగీ
- భారత్ కి బర్బాదీ తక్, జంగ్ రహేగీ- జంగ్ రహేగీ
- అఫ్జల్‌కి హత్యా నహీ సహేంగీ... తరహా నినాదాలతో విద్యార్థులు హోరెత్తించారని తేల్చింది.

ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన జేఎన్ యూ విద్యార్థి నేతలు కన్నయ్య కుమార్, ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను దేశ ద్రోహం కింద అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. కాగా, ఉమర్, భట్టాచార్యలను బయటికి పంపిన వర్సిటీ యాజమాన్యం.. ఉమర్‌కు రూ. 20వేల జరిమానా విధించింది. జూలై 23 నుంచి అనర్బన్‌పై ఐదేళ్ల నిషేధం విధించింది. కన్నయ్య కుమార్‌కు రూ. 10వేల జరిమానా విధించింది.

English summary
The Central Forensic Science Laboratory (CFSL) has authenticated four videos related to the February 09 incident at the Jawaharlal Nehru University, saying anti-national slogans were raised during the event organised to commemorate the hanging of Parliament attack convict Afzal Guru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X