రాహుల్ రాజీనామాపై తొలగని సస్పెన్స్.. నేడు మరోసారి భేటీ కానున్న కాంగ్రెస్ కోర్ గ్రూప్..
ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల్లో పరాభవంతో నిరాశలో కూరుకుపోయిన పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్లు శ్రమిస్తున్నారు. ఒకవైపు ఓటమి, మరోవైపు రాహుల్ రాజీనామా నిర్ణయం నేపథ్యంలో కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు త్వరలో పార్లమెంటు సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో సభలో కాంగ్రెస్ పక్ష నేత ఎంపిక అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు కాంగ్రెస్ కోర్ గ్రూప్ బుధవారం సమావేశం కానుంది.

ఆంటోనీ నేతృత్వంలో భేటీ
కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ నేతృత్వంలో కోర్ గ్రూప్ భేటీ జరగనుంది. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పక్ష నేత నియామకం, రాహుల్ రాజీనామా నిర్ణయం నేపథ్యంలో ఆయనకు భారం తగ్గించే విషయంలో పార్టీ సీనియర్లు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. కాంగ్రెస్ కోర్ గ్రూప్‌లో సభ్యుడు కాకపోయినా సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గేను బుధవారం జరగనున్న సమావేశానికి ఆహ్వానించడం విశేషం.

వర్కింగ్ ప్రెసిడెంట్‌పై నిర్ణయం
రాహుల్ గాంధీకి భారం తగ్గించే ప్రయత్నంలో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని పార్టీ సీనియర్లు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ ఛైర్ పర్సన్‌గా జూన్ 1న సోనియా గాంధీని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో ఆమె కాంగ్రెస్ కోర్ గ్రూప్ భేటీ అనంతరం లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేతల పేర్లు ప్రకటించే అవకాశముంది. 16వ లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేతగా వ్యవహరించిన మల్లిఖార్గున ఖర్గే ఈసారి ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. దీంతో ఆయన స్థానంలో మరొకరిని నియమించనున్నారు.

రాజీనామాపై వెనక్కితగ్గని రాహుల్
ఎన్నికల ఫలితాల అనంతరం రాజీనామాకు సిద్ధమైన రాహుల్ గాంధీ కనీసం పార్టీ నేతలతో సమావేశమయ్యేందుకు నిరాకరించారు. అయితే వయనాడ్ పర్యటన అనంతరం ఆయన పార్టీ సీనియర్లతో సమావేశమవుతున్నా ప్రెసిడెంట్ పదవి నుంచి తప్పుకునే విషయంలో ఇంకా వెనక్కి తగ్గలేదు. అయితే రాహుల్ రాజీనామాను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇప్పటికే తిరస్కరించారు. రాహుల్‌పై భారాన్ని తగ్గించేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ను నియమించాలని భావిస్తున్నారు.
మల్లిఖార్జున ఖర్గేతో పాటు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మోతీలాల్ ఓరా, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్‌లలో ఒకరిని వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
-
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు












Click it and Unblock the Notifications