• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కాంగ్రెస్‌కు ఎస్పీ-బీఎస్పీ చేయి: తమను వద్దనడంపై రాహుల్ గాంధీ స్పందన

|

న్యూఢిల్లీ: ఉత్తర ప్రదేశ్‌లో మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ (బహుజన సమాజ్ పార్టీ), అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ (సమాజ్‌వాది పార్టీ) పొత్తుపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ స్పందించారు. వచ్చే లోకసభ ఎన్నికల్లో బీజేపీయేతర కూటమిగా విపక్షాలన్ని ఒక్కటిగా వెళ్తామని భావిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మరికొందరు ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు.

ఇందులో భాగంగా ఎస్పీ, బీఎస్పీలు శనివారం పొత్తును ప్రకటించాయి. ఈ పర్టీలు కాంగ్రెస్‌తో కలిసి వెళ్లడం లేదు. రెండు పార్టీలే కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి అమేథి (రాహుల్ గాంధీ), రాయ్‌బరేలి (సోనియా గాంధీ) నియోజకవర్గాలు వదిలేయాలని నిర్ణయించాయి.

కాంగ్రెస్ పార్టీని కాదని, ఎస్పీ, బీఎస్పీలు పొత్తు పెట్టుకోవడంపై రాహుల్ గాంధీ స్పందించారు. ప్రతి ఒక్క పార్టీకి పొత్తుల విషయంలో వారి హక్కులు ఉంటాయని చెప్పారు. తమను కాదని వారు కూటమి ఏర్పాటు చేసుకున్నప్పటికీ తాము నిరాశ చెందటం లేదని చెప్పారు. వారికి నచ్చినట్లుగా ఉండే హక్కు ఉందని తెలిపారు.

పొత్తులో భాగంగా ఎస్పీ- బీఎస్పీలు కాంగ్రెస్‌ను ఎందుకు విస్మరించాయి...లాజిక్ ఇదేనా..?

Congress in Alliance or Not, End Result Same for BJP: Rahul Gandhi After SP-BSPs Snub

అలాగే తాము కూడా సొంత ఆలోచనల ప్రకారం ముందుకు వెళ్తామని రాహుల్ గాంధీ చెప్పారు. తనకు ఎస్పీ, బీఎస్పీ నాయకులపై అపారమైన గౌరవం ఉంగనిస ఇక ఇప్పుడు ఉత్తర్‌ ప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను బలోపేతం చేయడం తమ ముందు ఉన్న కర్తవ్యమని చెప్పారు. దీని కోసం పని చేస్తామని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ సమర్థంగా రాజకీయ కూటములను ఏర్పరుస్తోందని తెలిపారు.

యూపీలో తమ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా, ఎస్పీ-బీఎస్పీలతో కలిసి పోటీ చేసినా ఫలితం మాత్రం బీజేపీ సీట్లు కోల్పోతుందని అన్నారు. తద్వారా తమ టార్గెట్ కేవలం బీజేపీ సీట్లు కోల్పోవడమేనని అభిప్రాయపడ్డారు.

కాగా, ఎస్పీ, బీఎస్పీలు కలిసి యూపీలోని 80 లోకసభ స్థానాలకు గాను 76 చోట్ల పోటీ చేయాలని నిర్ణయించాయి. మిగిలిన నాలుగు సీట్లలో రెండింటిని మిత్రపక్షం ఆర్ఎల్డీకి ఇవ్వాలని నిర్ణయించాయి. మరో రెండు స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ (అమేథీ), యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ (రాయ్‌బరేలీ) వదిలేయాలని నిర్ణయించాయి.

శనివారం పొత్తుల గురించి అఖిలేశ్‌ యాదవ్‌, మాయావతిలు మాట్లాడుతూ... గత అనుభవాల దృష్ట్యా కూటమిలో కాంగ్రెస్‌ కలిస్తే తమకేమీ ప్రయోజనం ఉండబోదని అభిప్రాయపడ్డారు. దేశ రక్షణ పరమైన ఒప్పందాల్లో కాంగ్రెస్‌, బీజేపీ రెండింటిపై ఆరోపణలు వెల్లువెత్తాయని విమర్శించారు. 2017 ఉత్తర్ ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల్లో ఎస్పీ-కాంగ్రెస్‌ జట్టు కట్టినా ఓటర్లను తమవైపు తిప్పుకోలేకపోయాయి.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Hours after Samajwadi Party and Bahujan Samaj Party became partners-in-polls to take on the ruling BJP in Uttar Pradesh, an unfazed Rahul Gandhi said the Congress would spring a surprise in the forthcoming general elections.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more