విజయ్ కు లారెన్స్ బిగ్ ట్విస్ట్, అన్నామలై ఎంట్రీతో..!?
తమిళ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొద్ది రోజులుగా సినీ ప్రముఖుడు రాఘవ లారెన్స్ రాజకీయ ప్రవేశానికి రంగం సిద్దమయ్యారనే వార్త ఆసక్తి కరంగా మారింది. సీఎం విజయ్ పార్టీ టీవీకే తరఫున ఆయన ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు అనూహ్య ట్విస్ట్ చోటు చేసుకుంది. సీఎం విజయ్ తో రాఘవ కలిసి పని చేయటం పైన అనుమానాలు మొదలయ్యాయి. అన్నామలై ఎంట్రీతో సీన్ మారినట్లు పార్టీ నేతల సమాచారం.
రాఘవ లారెన్స్ పొలిటికల్ ఎంట్రీ పైన కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం విజయ్ రెండు స్థానాల నుంచి విజయం సాధించారు. అందులో తిరుచ్చి స్థానంకు రాజీనామా చేసారు. ఆ స్థానం నుంచి టీవీకే అభ్యర్దిగా రాఘవ లారెన్స్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఈ అంశం పైన ఈ నెల 11న తాను స్పష్టత ఇస్తానని తొలుత రాఘవ లారెన్స్ ప్రకటించారు. కాగా, భాగ్యరాజ్ కన్నుమూత తో తన నిర్ణయం రాఘవ లారెన్స్ వాయిదా వేసుకున్న ట్లు వెల్లడించారు. ఇదే సమయంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. రాఘవతో బీజేపీని వీడి కొత్త ఉద్యమం మొదలు పెట్టిన అన్నామలై మద్దతు దారులు టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. రాఘవ సైతం అన్నామలై గురించి సానుకూల ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.

విజయ్... అన్నామలై.. లారెన్స్ ఎటువైపు..?
లారెన్స్ రాజకీయ ఎంట్రీ ఖాయమని.. అయితే, ముందుగా భావించినట్లుగా టీవీకే తో ఉంటుందా అనేది ఇప్పుడు సందేహమేనని సన్నిహితులు చెబుతున్నారు. లారెన్స్ విజయ్ కంటే అన్నామలై వైపు మొగ్గు చూపుతున్నారని తెలుస్తోంది. అన్నామలై బీజేపీకి రాజీనామా చేసిన తరువాత ఆయన ప్రారంభించిన 'వి ది లీడర్స్' ఉద్యమం కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇప్పటికే 30 లక్షల మంది వరకు మద్దతు ప్రకటించినట్లు సమాచారం. కాగా.. రాఘవ లారెన్స్ టీవీకే నుంచి తొలుత పోటీ చేయాలని భావించినా.. ఇప్పుడు నిర్ణయం మార్పులో భాగంగానే ప్రకటన వాయిదా వేసారని ప్రచారం సాగుతోంది. దీంతో... ఒకటి, రెండు రోజుల్లోనే రాఘవ లారెన్స్ తన రాజకీయ నిర్ణయం పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications