వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోక్‌సభలో కాంగ్రెస్ డిప్యూటీ లీడర్‌గా గౌరవ్ గొగోయ్, విప్‌గా రవ్‌నీత్ బిట్టు నియామకం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోక్‌సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నేతగా గౌరవ్ గొగోయ్‌ను, విప్‌గా లూథియానా ఎంపీ రవ్‌నీత్ సింగ్‌ను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గురువారం నియమించారు. వీరి నియామకాన్ని లోక్‌సభలో ప్రతిపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి, చీఫ్ విప్ కే సురేష్‌లు ధృవీకరించారు.

సెప్టెంబర్ 14 నుంచి శీతాకాల పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వీరి నియామకం జరగడం గమనార్హం. దిగువసభలో పార్టీని పటిష్టపర్చడంలో భాగంగానే ఈ నియామకాలు జరిగాయని కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, ఇప్పటి వరకు లోక్‌సభలో ప్రతిపక్ష పార్టీకి డిప్యూటీ లీడర్ లేరు.

Congress Appoints Gaurav Gogoi as Deputy Leader, Ravneet Bittu as Whip in Lok Sabha

పంజాబ్ నుంచి మూడుసార్లు ఎంపీగా గెలుపొందిన బిట్టును కాంగ్రెస్ విప్ పదవిని కట్టబెట్టారు. తమిళనాడుకు చెందిన మరో ఎంపీ మాణిక్యమ్ ఠాగోర్‌ను కూడా దిగువసభలో మరో విప్‌గా నియమించారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న అస్సాం రాష్ట్రానికి చెందిన గౌరవ్ గొగోయ్‌ను డిప్యూటీ లీడర్‌గా నియమించడం గమనార్హం. కలియబోర్ లోక్‌సభ నియోజకవర్గంకు చెందిన ఈ ఎంపీ ఇప్పటి వరకు విప్‌గా ఉన్నారు. కాగా, అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగోయ్ కుమారుడే ఈ గౌరవ్ గొగోయ్. ఈయనకు గత వారమే ఓ కూతురు జన్మించింది.

Recommended Video

Congress President: గాంధీయేతర వ్యక్తికే పగ్గాలు ఖాయమా? Rahul Gandhi, Priyanka Gandhi అనాసక్తి

గత లోక్‌సభలో అమరీందర్ సింగ్ డిప్యూటీ లీడర్‌గా ఉన్నారు. ప్రస్తుతం ఆయన పంజాబ్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో సోనియా గాంధీనే తిరిగి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నుకున్న విషయం విధితమే.

English summary
Congress president Sonia Gandhi appointed Gaurav Gogoi as the party's deputy leader in the Lok Sabha and Ludhiana MP Ravneet Singh Bittu as its whip in the Lower House of Parliament on Thursday. Adhir Ranjan Chowdhury, the leader of the opposition party in the Lok Sabha, and K Suresh, its chief whip in the Lower House, confirmed the development.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X