సెప్టెంబర్ 10న భారత్ బంద్..ఎందుకో తెలుసా?

ఢిల్లీ: సెప్టెంబర్ 10న భారత్ బంద్‌కు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలపై నిరసనలు తెలుపుతూ బంద్‌కు పిలుపునించ్చింది కాంగ్రెస్. ఇంధన ధరలుల అమాంతం కొండెక్కి కూర్చోవడంపై కాంగ్రెస్ పార్టీ ఈ సెప్టెంబర్ 10న బంద్‌కు పిలుపునివ్వాలని నిర్ణయించిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా చెప్పారు. రూ.11 కోట్ల ఇంధనం లూటీ జరుగుతోందని సూర్జేవాలా ధ్వజమెత్తారు. వెంటనే సెంట్రల్ ఎక్సైజ్ పన్ను వ్యాట్‌ను తగ్గించాలని డిమాండ్ చేశారు.

విపక్ష పార్టీలు, పౌరసంఘాలు కూడా బంద్‌కు మద్దతు తెలిపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని కాంగ్రెస్ పిలుపు ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఇలా తీసుకువస్తే సామాన్యుడిపై భారం తగ్గుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ హయాంలో ఇంధన ధరలు పెరిగినప్పుడు పార్లమెంటులో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్‌‌ను బీజేపీ నేతలు టార్గెట్ చేసిన రెండు వీడియోలను హస్తం పార్టీ తన అధికార ట్విటర్‌పై పోస్ట్ చేసింది. 2014 లోక్‌సభ ఎన్నికలకు ముందు బీజేపీ ఎలాగైతే ధరల పెరుగుదలపై రచ్చ చేసిందో అంతకంటే పెద్దగా మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసేందుకు వ్యూహాలు రచిస్తోంది కాంగ్రెస్.

Congress calls for Bharath bandh on September 10th in protest of Rising fuel prices

ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటంతో భారత్‌లో ఇంధన ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఎక్సైస్ సుంకం భారీగా పడుతోంది. అంతేకాదు డాలరుతో రూపాయి విలువ పడిపోవడంతో ముడిచమురు దిగుమతి ఖర్చు కూడా పెరిగింది. ఈ ప్రభావం ఇంధన ధరల పెరుగుదలపై పడింది. అయితే అరుణ్ జైట్లీ మాత్రం పెరుగుతున్న ఇంధన ధరలు శాశ్వతం కాదని ఊరడించే మాటలు మాట్లాడారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+