వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలోని 403 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ ! ; బీజేపీపై పోరులో జైలుకెళ్లేందుకైనా సిద్ధం : ప్రియాంక గాంధీ

|
Google Oneindia TeluguNews

ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అన్ని తానై పార్టీని ముందుకు తీసుకెళ్తోంది కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి నేత ప్రియాంక గాంధీ. తమ సత్తా చాటేందుకు శక్తి వంచనలేకుండా కృషి చేస్తోంది. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత 403 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపింది. యోగి ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని ప్రియాంక గాంధీ హెచ్చరించింది. నిర్థిష్ట‌మైన వ్యూహంతో తాము ప్ర‌జ‌ల ముందుకు వెళ్తున్నామ‌ని.. తమ సత్తా ఎంటో ఎన్నిక‌ల్లో చూపిస్తామని స్పష్టం చేస్తున్నారు.

Recommended Video

UP Assembly Elections 2022 : Is Priyanka Gandhi Vadra CM For UP ? | Oneindia Telugu
 మూడు ద‌శాబ్దాల త‌ర్వ‌త 403 స్థానాల్లో పోటీ

మూడు ద‌శాబ్దాల త‌ర్వ‌త 403 స్థానాల్లో పోటీ

యూపీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో దాదాపు 30 ఏళ్ల తర్వాత తొలి సారిగా 403 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నేత ప్రియాంక గాంధీ వాద్రా వెల్లడించారు. ఇది తమ అతిపెద్ద ఘనతగా ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గౌతమ బుద్ధ నగర్ లో ప్రియాంక గాంధీ పర్యటించారు. అన్ని స్థానాల్లో ప్రత్యర్ధులకు గట్టి పోటీ ఇస్తామన్నారు. ప్రత్యర్థి పార్టీలు కుల, మత పరమైన రాజకీయ అంశాలపై దృష్టిపెట్టాయని మండిపడ్డారు. తాము కేవలం స్థానిక సమస్యలు, అభివృద్ధి అంశాలనే పరిగణలోకి తీసుకొని ప్రజల ముందుకు వెళ్తున్నామని చెప్పారు.

 యోగి స‌ర్కార్‌పై పోరాటం.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం

యోగి స‌ర్కార్‌పై పోరాటం.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం


రాష్ట్రంలో యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో వెనుకడగు వేసేది లేదని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. ఈ పోరాటంలో తనపై ఎన్ని కేసులు నమోదు చేసినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పారు. ప్రజల కోసం జైలు శిక్ష అనుభవించేందుకైనా రెడీగా ఉన్నారని తేల్చిచెప్పారు. ఛత్తీస్‌గడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ వంటి నేతలపై కేసులు నమోదు చేయడాన్ని ఆమె ప్రస్తావించారు. తాను ఉత్తరప్రదేశ్‌లో పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధమయినట్లు తెలిపారు. ప్రజల కోసం పోరాటానికి వెనుకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు.

 యువ‌త కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్

యువ‌త కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్

యూపీలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని ప్రియాంక గాంధీ హామీ ఇచ్చారు. దీని కోసం ప్రత్యేక జాబ్ క్యాలెండర్ తెస్తామని చెప్పారు. ప్రత్యర్థి పార్టీలు అధికారంలోకి రాగానే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు . కానీ ఎలా చేస్తారో అన్నది మాత్రం చెప్పడంలేదంటూ విమర్శించారు. ఉద్యోగ కల్పనపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన వైఖరితో ఉందన్నారు . అందుకే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇస్తున్నట్లు ప్రియాంక గాంధీ తెలిపారు.

 హోరా హోరీగా పోరాటం

హోరా హోరీగా పోరాటం

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ, ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీతోపాటు కాంగ్రెస్‌ పార్టీ హోరాహోరీగా పోరాడుతుంది.
గత 2017 ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీతో జతకట్టిన కాంగ్రెస్‌ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేక బోల్తా పడింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో 300లకుపైగా స్థానాలను బీజేపీ కైవసం చేసుకుని అధికారాన్ని దక్కించుకుంది. సమాజ్ వాదీ పార్టీ-కాంగ్రెస్‌ పార్టీలు కలిసి కేవలం 60 సీట్లు కూడా సాధించలేకపోయాయి. ఈ సారి ఒంటరిగా 403 స్థానాల్లో తమ అభ్యర్థులను పోటీలోకి దింపి తన అదృష్టాన్ని కాంగ్రెస్ పార్టీ పరీక్షించుకుంటుంది.

English summary
Congress contest 403 seats in UP after 30 years, Priyanka Gandhi Ready to go to jail in battle against BJP
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X