సీఎంకు సెగ, సీనియర్ మంత్రులకు షాక్, పక్కరాష్ట్రంలో పని అయిపోతే మేజర్ సర్జరీ !
బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో 135 ఎమ్మెల్యే సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ (congress) ప్రభుత్వంలో ఇప్పటికే మంత్రి పదవి గల్లంతు కావడంపై పలువురు సీనియర్ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో హాట్ టాపిక్ అయ్యింది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయనే చర్చ జోరుగా సాగుతోంది. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మంత్రి పదవిని కోల్పోయిన సీనియర్ ఎమ్మెల్యేలు సీఎం (cm) సిద్దరామయ్యపై (siddaramaiah) గుర్రుగా ఉన్నారు.
ఇప్పటికే చాలా మంది సీనియర్ ఎమ్మెల్యేలు బహిరంగంగా తమ అసంతృప్తిని వ్యక్తం చేసి కాంగ్రెస్ (congress) పార్టీకి దూరంగా ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 28 స్థానాలకు గానూ 20 స్థానాల్లో విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ధీమాగా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఉన్న గ్యాప్, అసంతృప్తిని చక్కదిద్దాలని కాంగ్రెస్ (congress) హైకమాండ్ టార్గెట్‌గా పెట్టుకుంది. అందుకే లోక్‌సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులు చెయ్యాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ (high command) డిసైడ్ అయ్యిందని తెలిసింది.

మంత్రి పదవులు ఆశించే వారి ఒత్తిడికి హైకమాండ్ తలొగ్గిందని కాంగ్రెస్ (congress) పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు. 135 సీట్లు సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ ప్రభుత్వ ఆయుష్షు కేవలం రెండున్నరేళ్లేనని జరుగుతున్న ప్రచారానికి బలం చేకూర్చేలా ఆ పార్టీ నాయకులు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ (congress) పార్టీలోని కొందరు నాయకులు అంటున్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటైన ఐదు నెలల్లోనే ప్రభుత్వం, మంత్రివర్గ (minister) విస్తరణపై చర్చలు పలుఅనుమానాలకు తావిస్తోంది. చాలా మంది సీనియర్ నేతలు ఈసారి మంత్రి పదవిని కోల్పోయే అవకాశం ఉందని తెలిసింది. చాలా మంది ఆశావహులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (siddaramaiah) కొత్త మంత్రివర్గంలో చేరడానికి ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అయితే చాలా మందికి ఆ అవకాశం చివరి క్షణంలో తప్పిపోయింది.

ఈ చర్చ ఇప్పటికే హైకమాండ్ (high command)వరకు వెళ్లిందని, అక్కడ నాయకులు సీఎం సిద్ధరామయ్యపై (siddaramaiah) అసంతృప్తి వ్యక్తం చేశారని, వచ్చే టర్మ్‌లో కొందరు నాయకులకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ హామీ ఇచ్చిందని ఆ పార్టీ నాయకులు కొందరు అంటున్నారు. మంత్రివర్గంలో ఎమ్మెల్యేలందరికీ మంత్రి పదవి ఇవ్వడం కుదరదని ఎమ్మెల్యే అశోక్ పట్టన్న మాట వాస్తవమే అని కొందరు నాయకులు అంటున్నారు.
ప్రస్తుతం సీఎం సిద్దరామయ్య (siddaramaiah) మంత్రివర్గానికి రెండున్నరేళ్లు పూర్తయిన వెంటనే మార్పులు చేసి మరో కొందరికి అవకాశం ఇస్తామని కర్ణాటక కాంగ్రెస్ (congress)పార్టీ ఇన్‌ఛార్జ్ రణదీప్ సింగ్ హామీ ఇచ్చారని తెలిసింది. అదృష్టవంతులు మంత్రులు అవుతారు. లేని వారు ఇంటికి వెలుతారని తెలిసింది. లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలవాలని రాష్ట్ర కాంగ్రెస్ (congress)నేతలకు హైకమాండ్ టార్గెట్ పెట్టిందని తెలిసింది.
ఈ నేపథ్యంలో సీనియర్ నేతల విశ్వాసాన్ని చూరగొనేందుకు (congress)హైకమాండ్ ఈ వ్యూహం పన్నిందని అంటున్నారు. మొదటి రెండున్నరేళ్ల తర్వాత కాకుండా లోక్ సభ ఎన్నికల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీలో నెలకొన్న అసంతృప్తిని చల్లార్చేందుకు కాంగ్రెస్ (congress)హైకమాండ్ కేబినెట్ సర్జరీకి ప్లాన్ చేసినట్టు సమాచారం.
కాంగ్రెస్ (congress)హైకమాండ్ కొంత మంది మంత్రులకు షాక్ ఇవ్వకుండా ప్లాన్ చేసిందని అంటున్నారు. సిద్ధరామయ్య మంత్రివర్గంలోని ప్రభావవంతమైన మంత్రులను మినహాయించి పూర్తి స్థాయి మేజర్ సర్జరీ చెయ్యడానికి కాంగ్రెస్ (congress)పార్టీ ప్లాన్ చేస్తోందని తెలిసింది. సిద్దరామయ్య (siddaramaiah) ప్రభుత్వంలో మంత్రులుగా పని చేస్తున్న చాలా మంది మీద కాంగ్రెస్ హైకమాండ్ (high command)నిఘా వేసిందని తెలిసింది.
కర్ణాటక (Karnataka) మంత్రులు హెచ్‌సీ. మహదేవప్ప, కే. వెంకటేష్, రెహమాన్ ఖాన్, బోసరాజు, శరణప్ప దర్శనాపుర్ తో సహా డి. సుధాకర్ ను మంత్రి పదవుల నుంచి తప్పించి వేరే వారికి మంత్రులుగా అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ (congress)పార్టీ బావిస్తోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణతో (hyderabad) పాటు ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి అయిన తరువాత కర్ణాటకలో (high command) మంత్రి వర్గంలో మార్పులు ఉంటాయని తెలిసింది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా












Click it and Unblock the Notifications