వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అంతా ..తూచ్... చైనా రాయబారితో రాహుల్ భేటీ, కొట్టిపారేసిన కాంగ్రెస్

సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రాయబారి లుయో జావొహుయ్‌తో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారని చైనా ఎంబసీ వెల్లడించడంతో కలకలంరేగింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో తమ రాయబారి లుయో జావొహుయ్‌తో కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమావేశమయ్యారని చైనా ఎంబసీ వెల్లడించడంతో కలకలంరేగింది.

ఈ నెల 8వ, తేదిన రాహుల్‌గాంధీ తమ దేశ దౌత్యవేత్తలతో సమావేశమయ్యారని సోమవారం తెలిపింది. రెండు దేశాల మధ్య ప్రస్తుతం నెలకొన్న ద్వైపాక్షిక సంబంధాలపై అభిప్రాయాలను లుయొతో పంచుకొన్నారని చైనా ఎంబసీ తమ వెబ్‌సైట్‌లో ప్రకటించింది.

Congress denies report of Rahul Gandhi-Chinese envoy meeting, slams ‘bhakts’

ఈ వార్తలను కాంగ్రెస్ పార్టీ ఖండించింది. చైనా దౌత్యవేత్తను రాహుల్‌గాంధీ కలవలేనది పేర్కొంది. ఇదంతా బిజెపి అనుకూల మీడియా కుట్రని కాంగ్రెస్ సమాచార విభాగం ఇంచార్జీ రణదీప్ సుర్జీవాలా ఆరోపించారు. విదేశాంగ , సమాచార మంత్రిత్వశాఖలు ఇచ్చిన సమాచారాన్ని బిజెపి అనుకూల టీవి ఛానెల్స్ ప్రసారం చేశాయని ఆరోపించారు.

పొరుగుదేశాలతో మనకు దౌత్య సంబంధాలున్నాయన్న విషయాన్ని గర్తుచేసుకోవాలని ఆయన సూచించారు. ముగ్గురు కేంద్రమంత్రులు చైనా పర్యటన గురించి ఎందుకు ప్రశ్నించలేదని ఆయన నిలదీశారు.

Recommended Video

KTR Fires On Rahul Gandhi

జీ 20 సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ప్రధాని మోడీ పరస్పరం ప్రశంసలు కురిపించుకొన్నారని బిజెపి భక్త చానెళ్ళు ఇప్పటికే ఊదరగొడుతున్నాయని చెప్పారు. ఛైనా దౌత్యవేత్తతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలను రాహుల్‌గాంధీ కార్యాలయవర్గాలు కొట్టిపారేశాయి.

కాగా, సిక్కింలో ఛైనా , భారత్ సైనిక వర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. డొక్లామ్ నుండి వెనక్కు తగ్గేదిలేదని , దేనికైనా సిద్దమనే సంకేతాలను చైనాకు భారత్ సైన్యం ఇచ్చింది. దరిమిలా చైనా దౌత్యవేత్తలతో రాహుల్‌గాంధఈ సమావేశం వెలుగుచూడడం రాజకీయవర్గాల్లో కలకలం రేపింది.

English summary
The Congress has denied a media report suggesting that party vice-president Rahul Gandhi met Chinese ambassador to India Luo Zhaohui on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X