నన్ను చంపాలని కలలుగంటున్నారు- మోడీ
Recommended Video
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ప్రధాని నరేంద్రమోడీ విమర్శల పదును పెంచారు. మధ్యప్రదేశ్ ఇటార్సీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్‌పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలకు తనపై చంపేయాలన్నంత కోపం ఉందని మోడీ చెప్పారు.
కాంగ్రెస్ నేతలకు తనపై చాలా ద్వేషం ఉందని మోడీ అభిప్రాయపడ్డారు. వారికి తనపై ఎంత కోపం ఉందంటే మోడీని చంపేయాలని కలలుగంటున్నారని ఆరోపించారు. కానీ మధ్యప్రదేశ్‌తో పాటు దేశ ప్రజలందరూ తన తరఫున నిలుస్తున్నారన్న విషయాన్ని కాంగ్రెస్ నేతలు మర్చిపోతున్నారని అన్నారు.

భోపాల్ కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్ సింగ్‌ను మోడీ టార్గెట్ చేశారు. వివాదాస్పద ఇస్లాం మత గురువు జకీర్ నాయక్‌తో కలిసి డిగ్గిరాజా డ్యాన్సులు చేశారని, ఆయనతో ఉగ్రవాదంపై పోలీసు అధికారులు ప్రసంగం ఇప్పించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఈస్టర్ బాంబు పేలుళ్ల అనంతరం శ్రీలంక జకీర్ నాయక్ టీవీ ఛానెల్‌పై నిషేధించిన విషయాన్ని మోడీ ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిని గతంలో కాంగ్రెస్ శాంతిదూతగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు.












Click it and Unblock the Notifications