గోవాలో కాంగ్రెస్ ఎందుకు ఫెయిల్ అయిందంటే...

Posted By:
Subscribe to Oneindia Telugu

పనాజి: ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు కావలసిన సంఖ్యా బలానికి చాలా దగ్గరగా ఉండి, ఒక చిన్న పార్టీ మద్దతిచ్చేందుకు ముందుకొచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీ గోవాలో అధికారం చేపట్టకుండా ఆగిపోవడానికి ఏకైకా కారణం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగేనని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఆయనతోపాటు గోవా స్క్రీనింగ్ కమిటీ చీఫ్ కేసీ వేణుగోపాల్ వల్లే తమకు అధికారం దక్కలేదని గోవా పీసీసీ చీఫ్ లుజిన్హో ఫాలైరో తీవ్ర ఆరోపణలు చేశారు. 40 స్థానాలున్న గోవాలో కాంగ్రెస్ పార్టీ 17 సీట్లు గెలుపొంది అతిపెద్ద పార్టీగా నిలిచింది.

మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో...

మ్యాజిక్ ఫిగర్ కి చేరువలో...

ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ 21కి కేవలం నాలుగు సీట్ల దూరంలో ఉండడంతో ఎలాగైనా తామే సర్కారును ఏర్పాటు చేస్తామనే ధీమాతో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. కానీ కేవలం 13 స్థానాలే గెలుపొందిన బీజేపీ రాత్రికి రాత్రే చక్రం తిప్పి.. చిన్న పార్టీల మద్దతుతో మెజారిటీని సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ముందు కాంగ్రెస్ కే మద్దతు...

ముందు కాంగ్రెస్ కే మద్దతు...

నిజానికి తాము మద్దతిస్తామంటూ గోవా ఫార్వర్డ్ పార్టీ నాయకుడు విజయ్ సర్దేశాయ్ ముందుగా దిగ్విజయ్ సింగ్ తోనే చెప్పారు. ఆ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్ వైపు వస్తే.. మరొక్క స్వతంత్ర అభ్యర్థి మద్దతు తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు.

గవర్నర్ ను కలవకపోవడం వల్లనే...

గవర్నర్ ను కలవకపోవడం వల్లనే...

కానీ అలాంటి సమయంలో దిగ్విజయ్ సింగ్ సరైన నిర్ణయం తీసుకోకపోవడం వల్లే గోవాలో అధికారం కాంగ్రెస్ చేజారిందనేది స్థానిక నాయకుల వాదన. ముందుగా గవర్నర్ మృదులా సిన్హా వద్దకు వెళ్లి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి ఉంటే, అతిపెద్ద పార్టీగా ముందు తమకే అవకాశం వచ్చి ఉండేదని ఫాలైరో వ్యాఖ్యానించారు. చివరికి మనోహర్ పారికర్ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిలిపివేయాలంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోయింది.

మద్దతు ఉందిగానీ.. సంతకాల్లేవు

మద్దతు ఉందిగానీ.. సంతకాల్లేవు

దిగ్విజయ్ సింగ్ స్పందించి ఉంటే కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చేందుకు మరికొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా అప్పటికి సిద్ధంగా ఉన్నారు. మార్చి 11వ తేదీ రాత్రికి తమకు 21 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, అయితే తమ వద్ద వాళ్ల సంతకాలు మాత్రం లేవని ఫాలైరో చెప్పారు.

ముందుచూపు శూన్యం...

ముందుచూపు శూన్యం...

కాంగ్రెస్ అధిష్ఠానం ఈ విషయంలో అన్ని అధికారాలను దిగ్విజయ్, వేణుగోపాల్ కు ఇచ్చిందని, వాళ్లు సకాలంలో స్పందించకపోవడం.. మరోవైపు బీజేపీ వెంట వెంటనే స్పందించడం వల్లే తమకు అధికారం దూరమైందని ఆయన వాపోయారు. మొత్తానికి కాంగ్రెస్ ఇలా గోవాలో అధికారానికి దూరమైందన్న మాట.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Events in Goa tell us exactly why the Congress is dying a slow, painful death and instead of empathising with it, why people are celebrating.Goa was within the party's grasp. Voters had given it enough seats to form the next government with the help of parties that had contested on an anti-BJP plank. On its part, the BJP was humbled and rejected, the defeat of the chief minister and his senior minister being evidence of the popular mood. Yet, the Congress not just failed to form the government but it also allowed the BJP to beat it in the race for the numbers.
Please Wait while comments are loading...