• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రావణుడిగా మోడీ, రాముడిగా రాహుల్.. కాంగ్రెస్ వింత యుద్ధం

|

భోపాల్ : కాంగ్రెస్ పార్టీ, బీజేపీల మధ్య వార్ రోజురోజుకీ పెరుగుతోంది. ఇరు పార్టీల నేతల మాటల తూటాలు రణరంగం తలపిస్తున్నాయి. ఇక లోక్‌సభ ఎన్నికల వేళ యుద్ధం పీక్ స్టేజీకి వెళ్లింది. అటు రఫేల్ వివాదంను తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. అదే స్థాయిలో బీజేపీ కూడా హస్తం గూటి నేతలపై ఎదురుదాడికి దిగుతున్నారు. తాజాగా బీజేపీ వయా నరేంద్ర మోడీ టార్గెట్ గా విసిరిన కాంగ్రెస్ బాణం చర్చానీయాంశంగా మారింది.

 ఫ్లెక్సీ యుద్ధం

ఫ్లెక్సీ యుద్ధం

బీజేపీ, కాంగ్రెస్ పార్టీ యుద్ధం ముదురుతోంది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఇరు పార్టీల నేతలు దూకుడు పెంచారు. మాటల యుద్దానికి తోడు ఫ్లెక్సీల యుద్ధం కూడా తోడైంది. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రధాని నరేంద్ర మోడీని పది తలల రావణుడిగా చిత్రీకరించిన ఫ్లెక్సీ దుమారం రేపుతోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీని రాముడిగా చూయించారు. రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంలో అధికార బీజేపీని దోషిగా చూపుతూ ఈ ఫ్లెక్సీని ముద్రించారు.

రఫేల్ విమానం మీద మోడీ ఫోటోను చిత్రీకరించి.. దానికింద " చౌకీదారే అసలు దొంగ" అంటూ ట్యాగ్ లైన్ పెట్టారు. సూరజ్ తివారీ ఫ్యాన్స్ క్లబ్ పేరిట వెలిసిన ఆ ఫ్లెక్సీ వివాదస్పదంగా మారుతోంది. కాంగ్రెస్ నేతల తీరుపై బీజేపీ శ్రేణులు మండిపడుతున్నారు.

 వివాదస్పద ఫ్లెక్సీలు..!

వివాదస్పద ఫ్లెక్సీలు..!

గతంలో కూడా బీజేపీ టార్గెట్ గా కాంగ్రెస్ నేతలు వివాదస్పద ఫ్లెక్సీలు ముద్రించారు. బీహార్ రాజధాని పాట్నాలో ఇటీవల కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జన ఆకాంక్ష ర్యాలీకి రాహుల్ గాంధీ వెళ్లిన నేపథ్యంలో ఆయనను రాముడిగా చిత్రీకరించిన ఫ్లెక్సీ కలకలం రేపింది. కాంగ్రెస్ అగ్రనేతల ఫోటోలను కూడా అందులో పొందుపరిచారు. బీజేపీ నేతలు రామ జపం చేస్తుంటే.. మీరు రాముడిగా మారి జీవించాలనేది ఆ ఫ్లెక్సీ సారాంశం. దానిపై వివాదం చెలరేగి పోలీస్ స్టేషన్ దాకా వెళ్లింది వ్యవహారం.

రాజ్యసభ సన్నివేశం కూడా..!

రాజ్యసభ సన్నివేశం కూడా..!

పంచమవేదమైన మహాభారతంలోని ద్రౌపది వస్త్రాపహారణ ఘట్టాన్ని నిరసన అస్త్రంగా వాడుకుంది కాంగ్రెస్. గతంలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాజ్యసభలో ప్రధాని మోడీ ప్రసంగానికి అడ్డుపడుతూ కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి బిగ్గరగా నవ్వారు. దీంతో ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ నేపథ్యంలో మహిళను ప్రధాని అవమానపరిచారంటూ కాంగ్రెస్ శ్రేణులు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. రేణుకాచౌదరిని ద్రౌపదిగా, రాహుల్ గాంధీని కృష్ణుడిగా మోదీ, అమిత్ షా, కిరణ్ రిజుజును కౌరవులుగా చిత్రీకరించిన ఆ ఫోటో అప్పట్లో సంచలనంగా మారింది. వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. అదలావుంటే బీజేపీ నేతలు కూడా గతంలో ప్రియాంక గాంధీ, రాహుల్ టార్గెట్ గా హోర్డింగ్స్, పోస్టర్లు ప్రదర్శించారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The war between the Congress Party and the BJP is on the rise every day. The words of the leaders of the two parties are taking place in high. In the Lok Sabha election mood, the battle went to the Peak Stage. Now bhopal congress leaders print a flexi and shown pm narendra modi with ten head of ravana, Congress national president Rahul Gandhi was seen as Ram.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more